పవన్‌కళ్యాణ్.. ఏం ఆలోచిస్తున్నారు. అసలు ఇతనికంటూ ఒక వ్యూహం లేదా! రాజకీయం తెలియకుండా ఎందుకిలా చేస్తున్నాడు. పవన్‌కు తిక్క ఉన్నమాట నిజమే. కానీ దానికి లెక్కేలేదు. ఎప్పుడూ ఫామ్‌హౌస్.. పశువులు.. చెట్లు ఏందీ డ్రామా. ఇలా ప్రతిపక్షాలు.. నచ్చని వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుంటారు. ఆయన గడ్డం పెంచినా కామెంట్ చేస్తారు. మెట్రో ఎక్కినా విమర్శిస్తారు. ఇదంతా పవన్ అంటే ఉన్న జెలసీ.. కేవలం పవన్ అనే వైబ్రేషన్‌కు భయపడుతూ చేసే కామెంట్స్ అంటూ పవన్ అభిమానులు కొట్టిపారేస్తుంటారు. నిజంగానే పవన్‌కు రాజకీయం తెలియదా! అందరిలా తాను ఎందుకు ఉండాలనుకోవట్లేదు. ఓడినా కూడా ఎందుకు ఇప్పటికీ జనాన్ని పట్టుకున్నారు. సేవ.. సేవ అంటూ జనసైనికులను కరోనా వచ్చినా తుపాను సంభవించినా.. ఏ విపత్తు సంభవించినా పరుగెత్తి సేవ చేయమని ఆదేశిస్లున్నాడు. నిజమే.. రాజకీయం అంటే ఎన్నికలపుడు వచ్చి ముఖానికి నవ్వు పులుకుముని.. దగ్గరకు తీసుకుని నెత్తిమీద చేతులు పెట్టడమే కాదు.. పవర్ లేకపోయినా ప్రజల మధ్య నిలబడటమే అనేది జనసేన సిద్ధాంతం అంటారు పవన్ కళ్యాణ్.
2019లో నిజంగానే జనసేనకు ఎలాంటి వ్యూహం లేదు. టీడీపీ, బీజేపీతో పొత్తు ఉన్నా ఎందుకో మరీ పవన్ వెనుకడుగు వేశారు.బీజేపీతో కలసినడిస్తే కనీసం 10 సీట్లు వచ్చేయని వాదించినవారూ లేకపోలేదు. కానీ బీఎస్పీ, సీపీఐ, సీపీఎం వంటి బలం లేని పార్టీలకు ఊపిరి పోసినట్టుగానే జనసేన మిత్రుత్వం కలిపింది. కానీ.. ప్రయోగం బెడసి కొట్టింది. ఇవన్నీ రాజకీయ సమీకరణల్లో భాగమే ఎక్కడ సక్సెస్ అవుతాము.. ఇంకెక్కడ ఫెయిల్ అవుతామనేది అంచనా వేయాలంటే సొంతగా ప్రయోగాలు చేయాల్సిందే . నిన్నటి వరకూ పవన్ చేసింది కూడా అదే.. ఇప్పుడు 2023 జమలి ఎన్నికల కోసం పవన్ సరికొత్త రాజకీయానికి తెరలేపారు. అంతర్గత సమీక్షలు.. సర్వేలు.. అధికార, ప్రతిపక్షపార్టీ ల బలాబలాలు.. యువ ఓటర్లను దగ్గర చేసుకోవటం.. వీటన్నింటిని మించేలా.. ఓడినా సేనాని వెంట నడిచే సైనికులను గమనిస్తూనే ఉన్నారు.
పవర్ లోకి రావాలంటే కనీస సొమ్ములు కావాలి.. అందుకే.. వరుసగా ఆరు సినిమాలకు కమిట్ అయ్యారు. ఆ డబ్బు చాలు.. పోటీ చేసే వారిపై పెట్టేందుకు అంటూ చెప్పకనే చెప్పారు. మరోవైపు పార్టీను విమర్శించే వారికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే గ్లాసు గుర్తుమీద గెలిచిన రాపాక వరప్రసాద్.. మూడు నెలల కే పవన్ పట్ల అనుచితంగా మాట్లాడారు. జెండా పీకేస్తారంటూ ఏవో విమర్శలూ చేశారు. అప్పుడు కూడా పవన్ ఏం మాట్లాడలేదు. ఫాపం.. రాపాక కష్టాలు ఎవరికి తెలుసంటూ నర్మగర్బంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే రాపాకకు చెక్ పెట్టేందుకు.. రాజోలు నియోజకవర్గంలో బలమైన నాయకుడికి పగ్గాలు ఇవ్వబోతున్నారట. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా రాజోలులో అత్యథికంగా సభ్యత్వం నమోదు చేయగలిగారు. ఈ లెక్కన.. పవన్ తిక్కకే కాదు.. మౌనానికి కూడా ఒ లెక్క ఉంటుందంటూ జనసైనికులు తెగ ఫిదా అవుతున్నారట. దీనికి బీజేపీ నుంచి అనుకున్నంత అండ దొరికితే… ప్రత్యర్థులకు చుక్కలు చూపినట్టే.