ప‌వర్‌ స్టార్ ఫ్యాన్స్ వ్య‌తిరేకించ‌లేదంటున్న టీవీ9 యాంక‌ర్ దేవి

బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన టీవీ9 యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి. ఎలిమినేష‌న్‌లో భాగంగా బిగ్‌బాస్ తీసుకున్న నిర్ణ‌యం. కానీ.. దీనికి ప‌వ‌న్‌ఫ్యాన్స్ కార‌ణ‌మంటూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్‌. ల‌క్ష‌లాది మందికి సేవ చేసిన‌న‌పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్ క‌నిపించ‌రు. వేలాదిమంది ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండ‌ర్లు పంపిణీ చేసిన‌న‌పుడూ తెలియ‌ని జ‌న‌సైనికులు ఇప్పుడు దేవి ఎలిమినేష‌న్ అన‌గానే గుర్తొచ్చారు. అంతే.. ప‌వ‌న్ ఫ్యాన్స్ అంటే చిన్న‌చూపుగా చూస్తూ.. వారి ఎమోష‌న్స్‌ను త‌ప్పుగా అర్ధంచేసుకునే వ‌ర్మ‌లాంటి వాళ్ల‌కు ఇదీ అవ‌కాశంగా మారింది. అంతే.. చూశారా.. దేవి వంటి మంచి యాంక‌ర్‌ను అర్ధాంత‌రంగా బ‌య‌టకు రావ‌టానికి కార‌ణం వీళ్లేనంటూ విష‌ప్ర‌చారం మొద‌లుపెట్టారంటూ ప‌వ‌న్ అభిమానులు బోలెడంత ఆవేద‌న‌కు గుర‌య్యార‌ట‌. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలోనూ ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సైనికులు పోస్టులు ఉంచారు. జ‌న‌సేన‌ను వ్య‌తిరేకిస్తూ త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేసే వారికి మాత్ర‌మే తాము వ్య‌తిరేక‌మ‌ని తేల్చిచెబుతున్నారు. కొన్ని మీడియా హౌస్‌లు చేస్తున్న చెడు ప్ర‌చారాన్ని మాత్ర‌మే తాము ఖండిస్తున్నామ‌ని.. ఉద్యోగుల ప‌ట్ల త‌మ‌కు ఎటువంటి దుర‌భిప్రాయం లేద‌ని.. వారిని వ్య‌తిరేకించేంత‌టి కు సంస్కారం జ‌న‌సైనికులు లేదంటూ కొట్టిపారేస్తున్నారు.

దీనిపై ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కూడా దేవి నాగ‌వ‌ల్లి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌పై త‌న‌కు ఎటువంటి అనుమానాలు లేవంటూ తెలిపారు. పైగా తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌పుడు బ‌య‌ట జ‌రిగే విష‌యాలు త‌న‌కెలా తెలుస్తాయంటూ ప్ర‌శ్నించారు. త‌న‌ను ఇన్నాళ్లు కొన‌సాగించేందుకు బ‌య‌ట ఓటు చేసిన వారు కూడా ఎవ‌ర‌నేది త‌న‌కు తెలియ‌దంటూ చెప్పుకొచ్చారు. కేవ‌లం ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ల్ల‌నే తాను ఎలిమినేష‌న్ అయ్యానంటూ జ‌రిగే ప్ర‌చారాన్ని కొట్టిపారేశారు. మెగా కుటుంబ స‌భ్యుల‌ను ఎంతోమందిని తాను ఇంట‌ర్వ్యూచేశాన‌ని.. అంద‌రూ చాలా ఆప్యాయంగా ఉంటారంటూ ఆనందం వెలిబుచ్చారు. అమెరికాలో ఒక‌సారి తాను ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూ కోసం ప్ర‌య‌త్నించిన‌పుడు బౌన్స‌ర్లు అడ్డుకున్నార‌ని.. ఎక్క‌డో దూరంగా ఉంటూ చూసిన ప‌వ‌న్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి మ‌రీ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు కావాలా.. త‌రువాత ఇవ్వ‌నా అంటూ అడిగి మ‌ర్యాద ఇచ్చారంటూ చెప్పారు. అంత‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ను అవ‌మానించి త‌ప్పుడు ప్ర‌చారం చేసేంత స్థాయిలో తానేమీ మాట్లాడ‌లేద‌న్నారామె. మ‌రి ఇప్ప‌టికైనా.. ఇలా ప‌వ‌న్ పై ప‌నిగ‌ట్టుకుని విషప్ర‌చారం చేసే బ్యాచ్ నోళ్లు ఇప్ప‌టికైనా మూత‌బ‌డాంటున్నారు జ‌న‌సైనికులు.. ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌.

Previous articleజ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో న‌రేంద్రుడు ఏం మాట్లాడారంటే….???
Next articleపచ్చదనానికి జై కొడుతున్న హైదరాబాదీ ! – Watch Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here