ప్రభుదేవ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమికుడు’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 13న గ్రాండ్ రీ రిలీజ్

మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు.

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవుతోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవా తో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్స్. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

నటీనటులు : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా, ఎస్. పి. బాలసుబ్రమణ్యం, గిరీష్ కర్నాడ్, వడివేలు, రఘువరన్ తదితరులు.

టెక్నీషియన్స్ :
నిర్మాణం : జెంటిల్మెన్ ఫిలిం ఇంటర్నేషనల్
నిర్మాతలు : మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్
మ్యూజిక్ : ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్. రెహమాన్
దర్శకుడు : సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్
వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ : మురళీధర్ రెడ్డి, రమణ
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ : సి ఎం ఆర్ ప్రొడక్షన్స్
పి ఆర్ ఓ : మధు VR

Previous articleవినాయక చవితి స్పెషల్ ఈవెంట్ – జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ
Next articleరజత్ రజనీకాంత్ సర్వైవర్ సినిమాతో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here