ట్రస్మాతో ప్రత్యేక భాగస్వామ్యం చేసుకున్న ప్రాక్టికల్లీ

హైదరాబాద్‌, 10 జూన్‌ 2021: భారతదేశపు సుప్రసిద్ధ, లీనమయ్యే అభ్యాస ఎడ్‌టెక్‌ సొల్యూషన్స్‌ మరియు హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన ప్రాక్టికల్లీ, తాము తెలంగాణా స్కూల్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (ట్రస్మా)తో ప్రత్యేకంగా భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో సాంకేతికాధారిత విద్యను తెలంగాణా రాష్ట్రంలో 33 జిల్లాల్లోని 10వేలకు పైగా పాఠశాలల్లో 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు, 33 లక్షల మంది విద్యార్థులకు చేరువ చేయనుంది.
లీనమయ్యేలా విషయ పరిజ్ఞానం మరియు అభ్యాస అనుభవాలను తమ వినూత్నమైన ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌ ద్వారా ప్రాక్టికల్లీ అందిస్తుంది. 3డీ విజువల్‌ కంటెంట్‌, నిజ జీవిత తరహా సిమ్యులేటర్, అగుమెంటెడ్‌ రియాల్టీ మాడ్యుల్స్‌, టెస్ట్‌ ప్రిపరేషన్‌ మరియు ప్రత్యక్ష తరగతులు వంటి సామర్థ్యాలను ఉపాధ్యాయులు సంతరించుకోవడం ద్వారా కె–12 విద్యార్థులు స్టెమ్‌ నేపథ్యాలను అత్యుత్తమంగా నేర్చుకోవడంలో సహాయపడగలరు. ప్రాక్టికల్లీ త్వరలోనే ఒక మిలియన్‌ ఎంఏయు పరిపూర్తి చేయనుంది మరియు భారతదేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. ఇటీవలనే కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో ప్రవేశించింది. లాభాపేక్ష లేని సంస్థ ట్రస్మా. తెలంగాణాలో ప్రైవేట్‌ పాఠశాలల అభివృద్ధి, సంక్షేమం దిశగా ఇది పనిచేస్తుంటుంది. విద్య, సాంకేతికాధారిత విద్య మరియు ఉపాధ్యాయులు, స్కూల్‌ లీడర్ల స్ధిరమైన వృద్ధి పరంగా నాణ్యమైన ఆవిష్కరణలను చేయడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ ప్రత్యేకమైన భాగస్వామ్యంతో, ప్రాక్టికల్లీ ఇప్పుడు ఉచితంగా తమ ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌ను ట్రస్మా సభ్య పాఠశాలలకు అందిస్తుంది. దీనిలో భాగంగా అన్ని వీడియో, అనుభవ పూర్వక కంటెంట్‌, టెస్ట్‌ ప్రిపరేషన్‌, ఇతర బోధనా పద్ధతులను సైతం వారు పొందవచ్చు. ప్రాక్టికల్లీ ఇప్పుడు తరచుగా శిక్షణా సదస్సులను సైతం నిర్వహించడంతో పాటుగా డిజిటల్‌ ఉపకరణాలను వినియోగించడంలో ఉపాధ్యాయులకు సహాయపడుతుంది. అలాగే ప్రస్తుత, నూతన ఉత్పత్తి ఫీచర్ల పట్ల వారికి అవగాహన కల్పించడం, బోధనా సమయంలో ఎలాంటి అసౌకర్యానికీ గురి కాకుండా ఈ ఫీచర్లను వినియోగించుకునే అవకాశం కల్పించడం చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా పాఠశాలలు ఇప్పుడు ప్రాక్టికల్లీ యొక్క అత్యాధునిక సాంకేతికతలను వారి యొక్క బోధన–అభ్యాస ప్రక్రియలకు మిళితం చేస్తుంది.
‘‘ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులలో, బోధనను మరింత ప్రభావవంతంగా కొనసాగించేందుకు, వర్చువల్ బోధన విధానంతో మరింత సులభంగా విద్య నేర్చుకోవడాని మరియు నేర్పించాడనికి పాఠశాలలకు తగిన పూర్తి సహాయం కావాలి. ట్రస్మా (TRSMA)తో కలిసి పనిచేయడాన్ని తాము ఓ గౌరవంగా భావిస్తున్నాము. తద్వారా పాఠశాలల విద్యావసరాలను తీర్చడంతో పాటుగా అనుభవపూర్వక అభ్యాసం ద్వారా లీనమయ్యే విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు సైతం ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌ అందిస్తుంది. మహమ్మారి నేపథ్యంలో, నిరంతర విద్యాభ్యాసానికి భరోసా అందించడం అతి ముఖ్యమైన అంశమని మేము నమ్ముతున్నాము. ఆన్‌లైన్‌ విద్యను మరింత సులభం చేయడం, దానికి అవసరమైన నైపుణ్యం వేలాది మంది ఉపాధ్యాయులకు అందించడం, ట్రస్మా సభ్యత్వ పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేయడంలో తమ వంతు పాత్రను తాము పోషిస్తున్నాము’’అని ఈ సందర్భంగా ప్రాక్టికల్లీ సహ వ్యవస్థాపకురాలు మరియు సీఓఓ శ్రీమతి చారు నోహిరియా అన్నారు.

ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు శ్రీ యాదగిరి శేఖర్‌ రావు మాట్లాడుతూ ‘‘మహమ్మారి కారణంగా సంప్రదాయ విద్యా బోధనలో అవాంతరాలు ఏర్పడిన వేళ ఈ భాగస్వామ్యం ఏర్పడింది. పాఠశాలలు ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించగలుగుతున్నప్పటికీ, భౌతిక తరగతి గది లా అదే తరహా అభ్యాస వాతావరణం లేకపోవడం విద్యార్థులకు సవాల్‌గా పరిణమిస్తుంది. ప్రాక్టికల్లీ యొక్క సాంకేతికత సంప్రదాయ తరగతి గది, అభ్యాసాంశాలను పునరావిష్కరించడం వల్ల విద్యార్థులు అతి సులభంగా నేర్చుకునే౦దుకు తోడ్పడటంతో పాటుగా కోర్సు కరిక్యులమ్‌ను ఆన్‌లైన్‌లో అర్థం చేసుకునేందుకు సైతం తోడ్పడుతుంది. రేపటి అతిపెద్ద ఎడ్‌టెక్‌ యునికార్న్‌ మరియు తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఒకే ఒక్క సంస్థ అయిన ప్రాక్టికల్లీతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
ట్రస్మా తో ఈ భాగస్వామ్యంలో భాగంగా ట్రస్మా కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రాక్టికల్లీ అందించింది. ఇటీవలి కాలంలో కోవిడ్‌ కారణంగా మృత్యువాత పడిన ట్రస్మా సిబ్బంది కుటుంబాలకు సహాయపడేందుకు ఈ మొత్తాలను వినియోగించనున్నారు.

కీలకాంశాలు
• ఎక్స్‌క్లూజివ్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ భాగస్వామిగా ట్రస్మాతో భాగస్వామ్యం చేసుకున్న ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌
• అత్యున్నత నాణ్యత కలిగిన విషయ పరిజ్ఞానం – 3డీ వీడియోలు, అగుమెంటెడ్‌ రియాల్టీ మాడ్యుల్స్‌, టెస్ట్‌ ప్రిపరేషన్‌, లైవ్‌ సిమ్యులేషన్స్‌ మొదలైవి ఈ పరిష్కారం అందిస్తుంది
• ఈ భాగస్వామ్యంతో తెలంగాణాలో 10 వేల పాఠశాలల్లో 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు, 33 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
• ట్రస్మా కోవిడ్‌ ఉపశమన నిధికి 5 లక్షల రూపాయలను విరాళంగా అందించిన ప్రాక్టికల్లీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here