హెచ్‌పీ నుంచి ప్రింట్‌ లెర్నర్‌ సెంటర్

ఇంటి నుంచి అభ్యసించేందుకు మద్దతునందిస్తూ ఉచిత అభ్యాస వర్క్‌షీట్లతో ప్రింట్‌ లెర్నర్‌ సెంటర్‌ను పరిచయం చేసిన హెచ్‌పీ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ ద్వారా ఎనిమిది భాషలలో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు మరియు లెర్నింగ్‌ మాడ్యుల్స్‌ను ప్రింట్‌ చేసేందుకు లభ్యం.అభిజ్ఞా, గణిత మరియు భాషా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు వెబ్‌సైట్‌పై 60 రోజుల అభ్యాస మెటీరియల్‌ లభ్యం.
ఇండియా, నవంబర్‌ 02,2020 ః హెచ్‌పీ ఇండియా నేడు తమ ప్రింట్‌ లెర్న్‌ సెంటర్‌ను ఆవిష్కరించడం ద్వారా భారతదేశంలో లక్షలాది మంది విద్యార్ధులకు ఇంటి నుంచి అభ్యసించేందుకు మద్దతునందిస్తున్నట్లు వెల్లడించింది. పిల్లల విద్యా నిపుణుల సృష్టి ఈ ప్రింట్‌ సెంటర్‌, శాస్త్రీయంగా రూపకల్పన చేసి ముద్రించతగిన అభ్యాస మాడ్యుల్స్‌ యొక్క నిధిగా నిలువనుంది. మూడు నుంచి 12 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు సమగ్రమైన అభ్యాస అనుభవాలను అందించేందుకు దీనిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వెబ్‌సైట్‌ http://www.printlearncenter.com/ ద్వారా అభ్యాస కంటెంట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు మరియు ప్రింట్‌ చేసుకునేందుకు లభ్యమవుతుంది.

ఈ కంటెంట్‌ మాడ్యుల్స్‌ను సుప్రసిద్ధ విద్యావేత్త డాక్టర్‌ స్వాతి పోపట్‌ వత్స్‌, అధ్యక్షులు, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌తో సంప్రదించి హెచ్‌పీ అభివృద్ధి చేసింది. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను చేరుకునేందుకు హెచ్‌పీ ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఎనిమిది భాషలు– ఆంగ్లము, హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీలలో అందిస్తుంది. సృజనాత్మకతకు స్ఫూర్తి కలిగించే రీతిలో రూపొందించడంతో పాటుగా ఈ కంటెంట్‌లో వినోదాత్మక కార్యకలాపాలు సైతం ఉంటాయి. ఇవి వయసు వర్గాల వారీగా అమర్చబడి ఉండటంతో పాటుగా వాటిని అతి సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటి వద్దనే సులభంగా ప్రచురించుకునేందుకు వీలు కల్పిస్తాయి. వీరికి అభ్యాసాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు, ఈ కంటెంట్‌ను విభిన్నమైన ఫార్మాట్లు అయినటుటవంటి వర్క్‌షీట్లు, కలరింగ్‌ పేజీలు, పజిల్స్‌ మరియు ఇతర అభ్యాస ప్రింటబల్స్‌గా సృష్టించారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు అభ్యాస విధానంపై తీవ్ర ప్రభావం చూపాయి. మరీ ముఖ్యంగా యువ చిన్నారుల అభ్యాసంపై ఇది తీవ్రంగా ప్రభావం చూపింది. మౌలిక వసతులు లేదా వనరుల కొరత తీవ్రంగా ఉండటంతో పాటుగా నూతన అభ్యాస విధానాలు అయినటువంటి ఈ–లెర్నింగ్‌ వైపు మారలేకపోయిన పాఠశాలల విద్యార్థులపై ఈప్రభావం మరీ ఎక్కువగా ఉంది. భారతదేశం లాంటి ప్రాంతాలలో ఇది అతి ముఖ్యమైన అంశంగా మారింది. ఇక్కడ తల్లిదండ్రులు అనుభవపూర్వక అభ్యాస ప్రయోజనాలకు అధిక విలువనిస్తారు. హెచ్‌పీ యొక్కనూతన ఆసియా అభ్యాస అనుభవ అధ్యయనం ప్రకారం, విద్యార్థులను నిలుపుకోవడంలో డిజిటల్‌ అభ్యాసమనేది కీలకమని 60%కు పైగా తల్లిదండ్రులు భావించారు. అనుభవపూర్వక అభ్యాసంతో తమ చిన్నారులలో చదివే సమయం కూడా పెరుగుతుందని వారు గుర్తించారు.

అభ్యాసంలో ఆవిష్కరణను నిర్మాణాత్మక 30 రోజుల అభ్యాస షెడ్యూల్‌ ద్వారా ప్రింట్‌ లెర్న్‌ సెంటర్‌ మాడ్యుల్స్‌ తీసుకువచ్చాయి. ఇవి తమ పాఠశాల ద్వారా చిన్నారులు పొందే విద్యకు సప్లిమెంట్‌గా తోడ్పడుతున్నాయి. ప్రత్యేక కారణాలతో రూపొందించిన ఈ మాడ్యుల్స్‌ గృహ అభ్యాసానికి తోడ్పడటంతో పాటుగా శారీరక ఆరోగ్యం, మోటార్‌ డెవలప్‌మెంట్‌, భాష, అభిజ్ఞా నైపుణ్యాలు, స్టెమ్‌ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి, ఇంద్రియ మరియు గ్రాహణ శక్తి అభివృద్ధి, సృజనాత్మక మరియు సౌందర్య ప్రశంసలు వంటి రంగాలలో అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.
‘‘భౌతిక దూర నిబంధనలు కారణంగా భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు బలవంతంగా ఇంటి నుంచి అభ్యసించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సంప్రదాయ అభ్యాస వాతావరణం లేని పరిస్థితులలో, తల్లిదండ్రులు తమ చిన్నారుల అభ్యాస మరియు అభివృద్ధి కొనసాగించడానికి సురక్షిత మార్గాలను వెదికేందుకు ఇబ్బంది పడుతున్నారు…’’ అని ప్రశాంత్‌ జైన్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌– హెచ్‌పీ ఇండియా అన్నారు. ‘‘సమగ్రమైన, అనుసంధానిత మరియు సమగ్రమైన కంటెంట్‌ను అందించడం ద్వారా తల్లిదండ్రులు మరియు విద్యార్ధులకు మద్దతునందించడానికి హెచ్‌పీ యొక్క ప్రయత్నం ప్రింట్‌ లెర్నర్‌ సెంటర్‌. ఈ కంటెంట్‌ను ప్రతి 30 రోజులకూ విద్యార్థులకు నూతన, మరింత ఉత్సాహపూరితమైన మాడ్యుల్స్‌ను అందిస్తుంది’’ అని అన్నారు.

30రోజుల షెడ్యూల్‌ పూర్తయిన తరువాత తల్లిదండ్రులు తమ చిన్నారులలో భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, సంఖ్య, సాధారణ అవగాహన, సామాజిక నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, రంగు, డ్రాయింగ్‌, రచన వంటి అంశాలలో నైపుణ్యాభివృద్ధి అంచనా వేయవచ్చు.

ప్రింట్‌ లెర్న్‌ సెంటర్‌పై మెటీరియల్‌ అంతా కూడా పూర్తి ఉచితంగా లభ్యమవుతుంది. నమోదిత చందాదారులకు అపరిమిత డౌన్‌లోడ్స్‌ చేసుకునే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌తో పాటుగా మెటీరియల్‌ను చందాదారులు పలు ఇతర మార్గాలైనటువంటి ఈ–మెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా కూడా పొందవచ్చు. వినియోగదారులు కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటుగా పేటీఏం మినీయాప్‌స్టోర్‌ ద్వారా దీనికి చందా చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here