సినీ నిర్మాత దగ్గుబాటు సురేష్‌బాబు.. తెలుగు చిత్రరంగంలో ఇమేజ్ ఉన్న ప్రొడ్యూసర్. పైసా తీయటంలోనూ ఆచితూచి స్పందిస్తారనే ఇండస్ట్రీలో పేరుంది. అటువంటి సురేష్‌బాబు వద్ద ఏకంగా లక్షరూపాయలు కొట్టేశాడు. ఇదెలా అంటారా.. కొవిడ్ టీకా కోసం జనం పరుగులు తీస్తున్నారు. మొన్నటి వరకూ భయపడిన వారు కూడా ఒక్క డోస్ దొరికినా చాలనేంతగా వెతుకుతున్నారు. ఇదే మాయగాడు నాగార్జునరెడ్డికి అనువుగా మారింది. తాను మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానంటూ 500 కొవిడ్ టీకా డోసులు ఉన్నాయని.. దాని కోసం లక్షరూపాయలు కావాలంటూ అడిగాడు. నిజమనే ఉద్దేశంతో సురేష్‌బాబు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. లక్షను తన భార్య బ్యాంకు ఖాతాలోకి జమచేయమంటూ తెలివిగా లాగేసుకున్నాడు. ఆ తరువాత టీకా…. గీకా జాన్తానై అన్నట్టుగా స్పందించాడు. రెండ్రోజులకే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయినట్టు ఆయన సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాఆ బురిడీ కొట్టించి లక్షలు గుంజేసినట్టు గుర్తించారు.