స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ పుష్ప ఒక్క పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసింది. రూ.150 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మాణం ప్రారంభించారు. సినిమాలో బన్నీ న్యూలుక్‌తో స్మగ్లర్లను తలపించాడనే ఫ్యాన్ అభిప్రాయం. ఐదు భాషల్లో రూపుదిద్దుకుంటున్న సినిమా కథ తనదేనంటూ ఓ రచయిత కొద్దిరోజుల హల్ చల్ కూడా చేశాడు. అడ్డంకులన్నీ అధిగమించి ఫారెస్ట్ సీన్లు.. కేరళ, చిత్తూరు అడవుల్లో చేయాలని ప్లాన్ చేసినా అక్కడ అనుమతులు రాలేదు. దీంతో సుకుమార్ తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకునేందుకు అనుమతులు తెచ్చుకున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి దాదాపు 30 రోజుల పాటు ఏకధాటిగా సినిమా షెడ్యూల్ ఫిక్స్ చేశారట. ఇప్పటికే నటీనటుల ఎంపిక, ఎవరెవరికి ఎన్ని రోజుల షూటింగ్ అనే వివరాలు కూడా చిత్రయూనిట్ పంపారట. నెలరోజుల పాటు చిత్ర యూనిట్ ఉండేందుకు వీలుగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారట. మరి లెక్కల మాస్టారి పుష్ప లెక్కలపై పెంచుకున్న అంచనాలు ఎలా సాధిస్తారనేది వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు బన్నీ అభిమానులు.