సూపర్ స్టార్ రజనీకాంత్ రెండోరోజు అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం హైబీపీలో జూబ్లీహిల్స్ అపోలో చేరిన రజనీకాంత్ ప్రస్తుత ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తాజాగా కొన్ని వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఇప్పుడిపుడు అధికరక్తపోటు సాధారణ స్థితికి వస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం ఏమిలేదని చెబుతున్నారు. చెన్నై నుంచి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం కుదుటపడినట్టుగానే ఉన్నా మరికొద్దిరోజులు ఆసుపత్రిలోన ఉండాల్సి వస్తుందని సమాచారం. ఏమైనా.. రజనీ ఆరోగ్య పరిస్థితిపై సినీ వర్గాలు, అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. రజనీకాంత్ ఆరోగ్యంపై మోహన్‌బాబు, చిరంజీవి, కమలహాసన్ వంటి ప్రముఖ హీరోలు.. స్నేహితులు ఆసుపత్రి వైద్యులతో ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతున్నారు.