సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. అన్నాత్తె షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ బృందం ఇటీవల కోవిడ్ భారిన పడింది. డిసెంబరు 22న జరిపిన వైద్యపరీక్షల్లో షూటింగ్‌లోని 6 గురు కొవిడ్ భారీనపడినట్టు నిర్దారించారు. రజనీకు మాత్రం నెగిటివ్ వచ్చింది. సినిమాలో కీర్తిసురేష్, నయనతార తదితర పెద్ద తారలు కూడా నటిస్తున్నారు. కొవిడ్ వైద్యపరీక్షల తరువాత రజనీకాంత్ హోంక్వారంటైన్‌లో ఉన్నారు. అయితే.. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో హైబీపీ రావటంతో సొమ్మసిల్లిపడిపోయారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన వైద్యులు రజనీకు కరోనా లేదని తేల్చారు. అధికరక్తపోటు కారణంగానే అనారోగ్య సమస్య తలెత్తినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం
కుదుటపడిందని.. హైబీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. అయితే.. రజనీ ఆరోగ్యంపై సమాచారం బయటకు పొక్కటంతో వందలాది మంది అభిమానును ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రజనీకాంత్ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు.