నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మూడ్రోజులుగా వెంటిలేటర్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. తాజాగా వెంటిలేటర్‌ను తొలగించారు. సహజపద్ధతిలోనే శ్వాస తీసుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల రాజశేఖర్ కుటుంబం కరోనా వైరస్ భారీనపడ్డారు. ఇద్దరు కూతుళ్లు హోంక్వారంటైన్ ద్వారా సాధారణ స్థితికి వచ్చారు. జీవిత, రాజశేఖర్ ఇద్దరూ సిటీ న్యూరో సెంటర్‌లో చేరారు. ఆ తరువాత రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వార్తలు వచ్చాయి. ఆయన కూతురు శివాత్మిక కూడా ట్వీట్టర్ ద్వారా తండ్రి ఆరోగ్యం కోసం అభిమానులు ప్రార్ధించాలంటూ కోరారు. దీంతో రాజశేఖర్ ఆరోగ్యంపై ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఆ తరువాత మరింత ఆరోగ్యం దెబ్బతిన్నట్టు పుకార్లు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజశేఖర్ కుటుంబానికి దైర్యం చెప్పారు. సీనియర్ వైద్యనిపుణుల ద్వారా రాజశేఖర్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారనే పుకార్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జీవిత కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు. రాజశేఖర్ కు ఆసుపత్రిలోనే ప్లాస్మా చికిత్స అందించారు. ఆధునిక వైద్య పద్ధతుల్లో చికిత్స చేశారు. దీంతో తిరిగి సాధారణ స్థితికి వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.