టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్ మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో బుధవారం గ్రీన్‌ఛాలెంజ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కినేని వారసుడు నాగచైతన్య విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన రకుల్ మొక్కలు నాటడం అందరి బాధ్యత అంటూ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు సతీష్ చేపట్టిన గొప్ప కార్యక్రమం పై ప్రశంసలు కురిపించారు. అందాల భామగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న రకుల్ ఫిట్‌నెస్ సెంటర్లను కూడా నడుపుతున్నారు. ఇటు సినిమా, అటు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్ రాకెట్‌లో రకుల్ పేరు రావటంతో బాగా కలతచెందింది. కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమయ్యారు.. మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు గ్రీన్‌ఛాలెంజ్ పుణ్యమాంటూ ఇలా బయటకు వచ్చారు.



