కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌ను వీడతారా! రాజకీయాల నుంచి తప్పుకుంటారా! బీజేపీ కండువా కప్పుకుంటారా! తెలుగు చిత్రపరిశ్రమలో లేడీ అమితాబ్‌గా పేరు పొందిన సూపర్‌స్టార్ విజయశాంతి ప్రయాణం ఎటువైపు. ఇటీవల ట్వీట్టర్ ద్వారా ఆమె చేసిన రెండు పోస్టులు దీనికి కారణమయ్యాయి. కాంగ్రెస్ మునిగేనావ.. కానీ.. 2018 ముందస్తు ఎన్నికల్లో చేతులు దాకా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. అనవసరమైన పొత్తులతో పరవు పోగొట్టుకున్నారు. అప్పుడు క్యాంపెయిన్‌లో సూపర్ హిట్ కొట్టిన విజయశాంతి.. పొత్తును అంగీకరించలేదట. ఒంటరిగా తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గగలదని చెప్పినా ఆమె మాట పార్టీ పెద్దలు కొందరు వినలేదట. పైగా.. విజయశాంతిపై చెడు ప్రచారం చేస్తూ మానసికంగా ఇబ్బందికి గురిచేశారట. ముందస్తు ఎన్నికల తరువాత చాలాకాలం.. విజయశాంతి పార్టీకు దూరంగా ఉంటూ వచ్చారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ప్రచారానికి వెళ్లలేదు. తాజాగా హస్తం నేత ఠాకూర్ వచ్చినపుడు లాంఛనంగా కలిశారు. ఆ తరువాత ఠాకూర్ రావటం ఆలస్యమైంది.. ముందుగా వచ్చినట్టయితే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ప్రజలు.. కాలమే నిర్ణయించాలంటూ ట్వీట్ చేశారు. బీజేపీ బలపడి.. సవాల్ విసురుతుందంటూ కమలం పార్టీను పొగిడినంత పనిచేశారు. అదే సమయంలో కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడే సమయం వచ్చిందంటూ సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలోనే విజయశాంతి బీజేపీ తీర్ధం పుచ్చుకోబోతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే తమిళనాడులో ఖుష్బూ కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదే బాటలో రాములమ్మ కూడా కాషాయగూటికి చేరతారనే ప్రచారానికి ఆమె చేసిన ట్వీట్లు బలంగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల లెక్కలు.