సుమన్‌ చేతుల మీదుగా ‘రంగస్వామి’ ట్రైలర్

నరసింహాచారి, డా. సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షిరెడ్డి, పల్సర్‌ బైక్‌ ఝాన్సీ కీల పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’. డ్రీమ్‌ సినిమా పతాకంపై స్వీయ దర్శకనిర్మాణంలో నరసింహాచారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని సీనియర్‌ నటుడు సుమన్‌ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘యువత డ్రగ్స్‌ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.. ఆతర్వాత ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందులో చక్కగా చూపించారు. యువతకు చక్కని సందేశమిస్తుంది. చాలా రోజుల తర్వాత చక్కని సందేశంతో కూడిన థ్రిల్లర్‌ చూసిన భావన కలిగింది. ట్రైలర్‌ చూశాక ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదనిపించింది. ఎమోషన్స్‌ పండించడం చాలా కష్టం. ఈ చిత్రంలో దానికే ఎక్కువ మార్కులు పడతాయి. తండ్రీ కొడుకుల మధ్య చక్కని భావోద్వేగాలు పలికాయి. ఇలాంటి చిత్రంలో నాకు పాత్ర రాలేదని కాస్త బాధగా ఉంది. సినిమా చూశాక మెండ్‌ ఫ్రెష్‌ అయినట్లు అనిపించింది. ఇలాంటి కథలు రావడం చాలా ఈ సమాజానికి అవసరం’’ అని అన్నారు.

సకారం మారుతి మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పింది మేమంతా చేశాం. మట్టిని పిండి బొమ్మగా మలచినట్లు మా నుంచి చక్కని నటన రాబట్టారు. ఆ క్రెడిట్‌ అంతా దర్శకుడిదే. సినిమాలపై ఎంతో అవగాహన, అనుభవం ఉన్న సుమన్‌గారు సినిమా చూసి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పైగా ఈ సినిమా నచ్చి మా టీం చేసే తదుపరి చిత్రంలో తప్పకుండ అవకాశం ఇవ్వాలని సుమన్ మమ్మల్ని కోరడం చాల ఆనందంగా అనిపించింది’’ అని అన్నారు.

Previous articleమెహర్ రమేష్ – బాబీ చేతుల మీదుగా చిరంజీవిపై ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్
Next articleదసరా థియేటర్స్ లో ‘గేమ్ ఆన్’ టీజర్ సందడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here