రాజాది గ్రేట్ సినిమా తరువాత హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో రవితేజ. ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కోరాజా కూడా ఆశించినంతగా ఆడలేకపోయింది. వరుసగా ప్లాప్‌లతో ఉన్న రవితేజ ఈ సారి క్రాక్మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో వస్తున్న క్రాక్‌లో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన బలుపు సూపర్‌డూపర్ హిట్టయియింది. తిరిగి అదే హిట్ రేంజ్లో దూసుకెళ్లాలనది రవితేజ చూస్తున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో షూటింగ్ ఆపేశారు. తాజాగా షూటింగ్ మొదలైనట్టు దర్శకుడు మలినేని గోపిచంద్ ప్రకటించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా మాస్ మహరాజ్ ఇమేజ్ను రెట్టింపు చేస్తుందంటున్నారు దర్శకులు. స్వయంకృషితో ఎదిగిన రవితేజ ఎంతోమందికి స్పూర్తి కూడా. వివాదాలకు దూరంగా ఉండే మాస్‌మహారాజ్ ఈ సారి మాంచి హిట్టు కొట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.