ఎస్.. రేవంత్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌కు మళ్లీ జీవకళ తీసుకురాగలరు. సీనియర్లు ఎంత మంది అలిగినా.. రాజీనామాలు చేసినా ఇదే వాస్తవం అంటోంది కేడర్. ఎప్పుడొచ్చామనేది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యమంటూ పోకిరీ స్టైల్లో రేవంత్‌కే కాంగ్రెస్ హైకమాండ్ పగ్గాలిచ్చింది. వీహెచ్, భట్టివిక్రమార్క, శశిధర్‌రెడ్డి , పొన్నాల వంటి పేద్దలు చిన్నబోయినా నా మాటే శాసనమంటూ సోనియాగాంధీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ బాహుబలి అనేది తీర్మానించారు. రేవంత్‌రెడ్డి కూడా ఆచితూచి అడుగులు వేయట్లేదు. జులై్ 7 పదవీ బాధ్యతలు చేపట్టేముందే సీనియర్లను కలసి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అన్నా.. మీరు చెప్పిన మాటే నాకు వేదం అంటూ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. రేపు అధికారంలోకి వచ్చాక అందరం కలిసే పదవులు అనుభవిద్దామనే భరోసానిస్తున్నారు. ఇది నిజంగానే హస్తానికి ఊరటనిస్తే…. టీఆర్ ఎస్‌కు కూడా ప్రాణాన్నిచే అంశంగా మారింది. అదెలా అంటారా.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కొత్త పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యమంటూ ముందుకొచ్చింది. వైఎస్‌పై ఇప్పటికీ ఉన్న అభిమానం, రెడ్డి సామాజికవర్గం కూడా షర్మిల వెంట నడుస్తారనే విశ్లేషణలున్నాయి. అయితే హస్తం అధ్యక్షుడిగా తెలంగాణలో రేవంత్‌రెడ్డి పేరు వినగానే గులాబీ నేతలు తెగ ఉబ్బిపోయారట. షర్మిల వైపు వెళ్లే నేతలు.. రేవంత్‌రెడ్డి వైపు మళ్లటంతో మున్ముందు తమకు సమస్య ఉండదనే లెక్కలు వేసుకుంటున్నారు.




కాంగ్రెస్ పార్టీ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు..