తెలంగాణా గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ తీర్మానం…….
టి.యన్.జి ఓ నాయకులకు మనవి,
అయ్యా M. రాజేందర్ గారు మరియు V. మమతా మేడం గారు, మీరు ఏమనుకుంటున్నారో ఏమో కాని మాకు అర్థం కావట్లేదు, కానీ మా ఒక్క రోజు జీతము మీరు ఎలా పణంగా పెట్ట, గలుగుతున్నారు.
మీరు గతంలో ఎన్నిసార్లు, ఈ క్రింద చూపిన మనకు రావలసిన హక్కులను, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్లి వచ్చిన తరువాత మీడియా ముందుకు వచ్చి ఈ క్రింద వ్రాసిన ప్రకటన చేసారు.ఇలా గత నాలుగు సంవత్సరాల నుండి ఉద్యోగులను మోసం చేస్తున్నారు, కాని ఉద్యోగులు మాత్రం,మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు, కావున మీ జీతం రెండు కాదు ముడు నెలలు ప్రభుత్వానికి ఇచ్చినా ఎవరూ అడుగరు అలా ప్రకటన చేయండి.
మేము మాత్రం ఇచ్చే పరిస్థితిలో లేము.
1. 3 D.A. తెచ్చారా?
2. P.R.C. తెచ్చారా?
3. పోనీ I.R. తెచ్చారా?
4. 3 నెలల కటింగ్ ఒకటే సారి ఇప్పించగలరా?
5. జీతాలు ఒకటో తారీకు ఇప్పించగలరా?
6. కొత్త ఉద్యోగాల గురించి అడిగారా? ఒక్కొక్కరు నలుగురి పనిచేస్తున్నారు.
7. పాత D.A. లు తక్కువ గా ఇచ్చారు వాటి గురించి మీరు ఎప్పుడైనా అడిగారా?
8. C.P.S. బాధితుల గురించి అడిగారా?
9. కరోనా వచ్చి నా సహోద్యోగులు, వారి కుటుంబ సభ్యులు చనిపోయారు వారి గురించి ఏమైనా అడిగారా? వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేశారా?
10. ఉద్యోగ మిత్రుల ఆరోగ్యం గురించి Health card మరియు హాస్పిటల్ గురించి ఏదైనా తెలుసుకున్నారా? ఒక్కరికి కూడా Health card సవ్యంగా వర్తించడం లేదు.
ఇంకా చాలా వాటి గురించి అడిగారా……………….
మరి ఇవన్నీ చేయని వారు మా జీతము ఎలా పణంగా పెడుతున్నారని?
వి.ఆర్.ఓ వ్యవస్థ రద్దు అయితే, ఎ ఒక్క నాయుకుడు మాట్లాడలేదు,ఆర్.టిసి.వారి గురించి మాట్లాడలేదు ఇలా .ఏ ఉద్యోగులకు నష్టం జరిగినా మీకు మాట్లాడే దైర్యం లేదు, మరి మా జీతం ఇచ్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు,సార్.ఇంకా, దయచేసి మా జీతము మేము ఇచ్చుకుంటామో, లేదా ఇవ్వమో అది మా మీద ఆధారపడి ఉంటుంది. కావాలంటే మీ జీతాన్ని మొత్తం ఇచ్చుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం
రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్ర రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.సుధాకర్ రావు. ప్రకటనలో కోరినారు