
చిత్రం : రివైండ్
నటీనటులు :
సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు
టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రాస్ వైర్ క్రియేషన్స్
మ్యూజిక్ : ఆశీర్వాద్
లిరిసిస్ట్ : రవివర్మ ఆకుల
సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్
ఎడిటర్ : తుషార పాలా
స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : కళ్యాణ్ చక్రవర్తి
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా, తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 18న ఈ సినిమాని సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
కథ :
ఒక సాఫ్ట్ వేర్ కంపెనిలో పని చేసే కార్తీక్ (సాయి రోనక్) తన స్నేహితుడు అపార్ట్మెంట్స్ లో తన స్నేహితురాలి ఇంటికి వచ్చిన శాంతి(అమృత చౌదరి)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ శాంతి మరుసటి రోజు అక్కడ నుంచి వేరొక చోటికి షిఫ్ట్ అవుతుంది. తనను వెతికే పనిలో పడ్డ హీరో ఆమె తన ఆఫీసులోనే పనిచేస్తుంది అనే విషయం తెలిసి మరింత సంబరపడతాడు. ఆమెకు తన ప్రేమ విషయం చెప్పేలోపే ఆమె తనకు ఒక ప్రియుడు ఉన్నాడన్న షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తుంది. అయితే శాంతి తాత(సామ్రాట్)కు చెందిన ఒక బ్యాగ్ తన ఇంట్లోనే ఉందని తెలుసుకుని కార్తీక్ ఒకరోజు దాని ద్వారా టైం ట్రావెల్ చేయవచ్చని తెలుసుకుంటాడు. శాంతి తన ప్రియుడిని కలిసే రోజుకి టైం ట్రావెల్ చేసి వాళ్ళిద్దరిని కలవకుండా చేస్తే తాను శాంతి ప్రేమలో పడచ్చని అలా చేస్తాడు. అదేవిధంగా తన తండ్రి చావును కూడా తప్పించి బతికించవచ్చని అనుకుంటాడు. అలా టైం ట్రావెల్ ద్వారా వెనక్కి వెళ్లిన కార్తీక్ అప్పుడు జరిగిన పరిణామాలను మార్చగలిగాడా? అసలు శాంతి తాతకు చెందిన బ్యాగ్ కార్తీక్ ఇంటికి ఎలా వచ్చింది? వెనక్కి వెళ్లిన కార్తీక్ తన తండ్రి(సురేష్) చావుని తప్పించగలిగాడా? తర్వాత ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని వెండి ధరపై చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ సినిమాలో కార్తీక్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో సాయి రోనక్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. పోష్, స్టైలిష్ కుర్రాడిగా కనిపిస్తూ అలరించాడు. ఇక అమృత చౌదరి శాంతి పాత్రలో తెలివైన అల్లరి పిల్ల లా బాగా నటించింది. ఒకపక్క అందంగా కనిపిస్తూనే మరో పక్కన తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరి పెయిర్ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. ఇక మిగతా పాత్రల్లో కనిపించిన సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తో సంగీత దర్శకుడు ఆకట్టుకున్నారు. పాటల కూడా వినడానికి చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా చాలా రిచ్ గా కనిపించింది. అందుకు సినిమాటోగ్రఫీ కూడా కీలకమైన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి.
విశ్లేషణ:
టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెలుగులోనే కాదు అనేక భాషల్లో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ వచ్చిన సినిమాలన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమా కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది. సినిమా మొదలైన తర్వాత సామ్రాట్ తన కుటుంబాన్ని తానే వెతుక్కుంటూ రావడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తర్వాత సామ్రాట్ మాయమవడం ఆ తర్వాత కథలోకి కార్తీక్, శాంతి ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరి క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా నడిపించాడు డైరెక్టర్. ఇంటర్వెల్ సమయానికి అనేక ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేసి సెకండ్ హాఫ్ లో ఒక్కొక్క దాని చిక్కుముడి విప్పుతూ కథను నడిపించిన విధానం బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ నుంచి సెకండ్ హాఫ్ కి ఉన్న కనెక్టివిటీ ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఊహకు అందకుండా పార్ట్ 2 ‘ఫాస్ట్ ఫార్వర్డ్’ కి ఇచ్చిన లీడ్ ఆశ్చర్యపరుస్తుంది. టైం ట్రావెల్ చేసి గతాన్ని మార్చాలి అనుకున్న హీరో దాన్ని మార్చగలిగాడా లేదా అనే విషయాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
మొత్తంగా రివైండ్ ఒక ఇంట్రెస్టింగ్ టైం ట్రావెల్ మూవీ. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడాలి అనిపించేలా ఎంగేజింగ్ గా తీసిన సినిమా.
రేటింగ్ 3.25/5
                


