ఎప్పుడూ మీడియా దృష్టిని, సినిమా ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకోవటంలో ఆరితేరినట్లుగా కనిపించే రాంగోపాల్ వర్మ, మళ్ళీ మరొక అంశాన్ని జనాలు చర్చించుకునేలా ఒక ట్విట్టర్ సందేశాన్నిచ్చారు. అదే.. తమిళనాట రాజకీయాల మీద తీయబోయే చిత్రం “శశికళ”. దీన్ని తమిళనాడు ఎన్నికలకి ముందుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి నే ప్రొడ్యూసర్!. రామ్ గోపాల్ వర్మ తో తెలుగు ప్రజలు సర్దుకు పోతున్నట్లుగానే తమిళనాట కూడా సర్దుకుపోతారా అనేది చూడాలి.



