డిసెంబర్లో మీకు నాకు ఇష్టమైన థియేటర్లో కలుద్దాం…మీరు విన్నది నిజమే.. మెగాహీరో సాయిధర్తేజ్ శుభవార్త చెప్పారు. సోలో బ్రతుకే సో బెటర్ ఎక్కడ రిలీజ్ చేస్తారనే అనుమానాలను నివృతి చేశారు. డిసెంబరులో థియేటర్లలో కలుద్దామంటూ హింట్ ఇచ్చారు. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న సోలో బ్రతుకే సో బెటర్‌పై ఎన్నో అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమాలో పాట దుమ్మురేపుతోంది. కొత్తగా కనిపిస్తూ ఫ్యాన్స్ ను అలరించారు కూడా. మెగాస్టార్ మేనల్లుడుగా వెండితెరకు పరిచయమైన సాయి ధరమ్‌తేజ్ మొదట్లో తడబడ్డాడు. వరుస ప్లాప్‌లతో ఇక పనైపోయినట్టేనంటూ ఎగతాళి కూడా చేశారు. కానీ.. చిరంజీవి ఎంట్రీతో సాయి రాత మారింది. సాయి సినిమాల ఎంపిక.. కథలను వినటం అంతా చిరంజీవి చేస్తున్నారు. మెగాస్టార్ నుంచి ఓకే అన్న తరువాత మాత్రమే సినిమా పట్టాలు ఎక్కుతుంది. ఇలా.. ఇప్పటికే రెండు హిట్లు కొట్టిన సాయిధరమ్‌తేజ్ మూడో సినిమా కూడా హిట్ కొట్టి.. హ్యాట్రిక్ సాధించాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.
https://www.facebook.com/SaiDharamTej/



