బిహార్-మహారాష్ట్ర ప్రభుత్వాలు జుట్టు పీక్కుంటున్నాయి. పోలీసు యంత్రాంగం నోరు తెరుస్తోంది. పచ్చిగా చెప్పాలంటే దర్యాప్తు సంస్థలన్నీ దిక్కులు చూసేలా చేనేలా చేసింది. ఏ ప్రముఖుడి మరణాన్ని కూడా ఇంతగా పరిశోధించి ఉండకపోవచ్చు. రోజుకో మలుపు.. పూటకో దర్యాప్తు.. అసలేం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు రాజ్‌పుత్ అలియాస్ సుశాంత్ మరణించి మూడు నెలల దాటుతున్నా ఇప్పటికీ అతడి మరణం మిస్టరీగానే ఉంది. రియా చక్రవర్తి, మహేశ్‌భట్ ఇద్దరి చుట్టూ ఉచ్చుబిగుస్తుండటంతో కేసుపై ఉత్కంఠత నెలకొంది. ఈ ఏడాది జూన్8వ తేదీనే సుశాంత్ మరణానికి ముహూర్తం పెట్టారు. దాని వెనుక స్కీన్‌ప్లే, డైరెక్షన్ ఎవరనేది ఇప్పటికైతే సస్పెన్స్. నిజానికి ఈ కేసు ముంబై పోలీసులు ఈజీగా తేల్చేవారు. సమర్థులైన పోలీసు బాస్‌లు ఎంతోమంది అక్కడున్నారు. అయినా డ్రగ్ మాఫియా చేతిలో అందరూ బంధీలయ్యారు. అక్కడ ఏం జరిగినా అంతా గప్‌చుప్.. ఒక దివ్యభారతి, మరో శ్రీదేవి మరణాలకు ముంబై వేదిక. అయినా.. ఆ ఇద్దరి మరణాలు ఇప్పటికీ సస్పెన్స్. సల్మాన్‌ఖాన్ అనబడే పేద్ద హీరో తప్పతాగి కారు నడిపాడు మొర్రో అన్నా అంతే సంగతులే. చేతిలో తుపాకీ ఉందని రెచ్చిపోయి దుప్పులను వేటాడినా నో న్యాయం. ఎందుకంటే అక్కడ ఖాన్‌ల త్రయమే అంతా నడిపిస్తోందంటూ ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర వేయించుకున్న కంగనా రనౌత్ వంటి ధైర్యస్తులు మాత్రమే నోరు విప్పగలరు. నిజానికి సుశాంత్ మరణం కూడా ఆత్మహత్యగానే మిగిలేది కానీ.. కంగనా వంటి స్టార్ ధైర్యంగా ముందుకొచ్చి.. సుశాంత్ వంటి మరికొందరు యువనటులు బలి కాకూడదనే సంకల్పంతో పోరు
మొదలుపెట్టింది.
తాజాగా.. సుశాంత్ మరణానికి డ్రగ్స్ కారణమంటూ బాంబు పేల్చింది. ఇప్పటికైనా నమ్మండి.. బాలీవుడ్ బాగోతం ఎంత నీచమైనవో . అమ్మాయిలు.. మత్తుమందులు.. చీకటి కార్యకలాపాలు సుశాంత్‌ను ప్రాణం తీశాయయని అంటోంది. సినీ ప్రముఖల ఇంట జరిగే విందు, వినోదాల్లో కొకైన్ చాలా సాధారణమని చెప్పింది. ఇది కొత్తేం కాదు.. డ్రగ్ మాఫియా మూలవిరాట్ దావూద్ ఇబ్రహీం పాక్ నుంచే ఇదంతా చేస్తున్నాడనేది కూడా జగమెరిగిన సత్యం. ఆ తరువాత కొంతమేర డ్రగ్స్‌ను కట్టడి చేసినా.. బాలీవుడ్‌లో చీకటి కార్యకలాపాలు.. వీఐపీల వినోదానికి కొకైన్ మాంచి కిక్ ఇచ్చే మత్తు. ఎవరు ఎవరితో కలిసుంటారో. ఎప్పుడెందుకు విడాకులంటూ కోర్టుకెక్కుతారో తెలియని పరిశ్రమ బాలీవుడ్. అక్కడ ఇవన్నీ కామన్.. అందుకే.. మర్డర్ చేసినా సూసైడ్ అంటూ తేలికగా కొట్టిపారేయగలరు. అయితే.. దీనికి తెలుగు పరిశ్రమ అతీతం కాదు..వెండితెరపై వెలగాలని వచ్చిన ప్రత్యూష మరణం వెనుక ఎవరున్నారనేది అందరికీ తెలుసు.. కానీ అది కూడా ప్రేమవిఫలమంటూ తేల్చారు. ఉదయ్‌కిరణ్ మరణం కూడా అదే ఖాతాలోచేరింది. ఇలా చాంతాడంత జాబితా.. నాలుగేళ్ల క్రితం.. టాలీవుడ్‌ను కుదిపేసిన మత్తుపదర్ధాల ముచ్చట ఇప్పటికీ తేలలేదు. దాదాపు 20 మంది వరకూ నటీనటలు, దర్శక ,నిర్మాతలు.. తరచూ థాయ్‌లాండ్‌లో చక్కర్లు కొట్టే బ్యాచ్ మొత్తం ఇందులో ఇన్వాల్వు అయింది. అయినా.. అది ఇప్పటికీ తేలలేదు. ఎప్పటికీ తేలబోదనేది కూడా అందరికీ తెలిసిందే. రంగురంగుల వెలుగుల్లో.. ప్రేక్షకులకు అందంగా కనిపించే ముఖాల వెనుక దాగిన వికృతరూపాలను భరిస్తూ ఉండాల్సిందే.