హర్ష్ కనుమిల్లి , సిమ్రాన్ చౌదరి నటిస్తున్న కొత్త చిత్రం సెహారీ ఈ రోజు కొందరు అతిథుల సమక్షంలో ప్రారంభమయింది. మొదటి షాట్ దిల్ రాజు క్లాప్ కొత్తగా, అల్లు బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రాన్ని విర్గో సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంతో గంగసాగర్ ద్వారకా దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా అవతరించిన సెహారీకి ప్రశాంత్ విహారీ సంగీతం అందించనున్నారు. ఈ రోజు టైటిల్ పోస్టర్ కూడా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు.