ఫిబ్రవరి 22న తెరపైకి రానున్న ‘షూటర్’

శ్రీ వెంకట సాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “షూటర్ “. రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22 న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ విభిన్న కథా కథనాలతో షూటర్ ని తెరకెక్కించాము. రవిబాబు ఆమని ఎస్తార్ రాశి సుమన్ కీలక పాత్రలను పోషించారు. ఇతరపాత్రల్లో అన్నపూర్ణమ్మ సత్యప్రకాష్ సమీర్ జీవా నటించారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్టిస్టుల తో అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా ఉంటుంది .అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

ఫిబ్రవరి 22 న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా శ్రీలక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు గారు ద్వారా రిలీజ్ కానుంది.

నటీనటులు : రవిబాబు, సుమన్, ఎస్తార్, ఆమని, రాశి,, అన్నపూర్ణ, సత్య ప్రకాష్, సమీర్, జీవా, ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ మహేష్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు.

స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే: పాయసం ధనుంజయ
సంగీతం : డ్రమ్స్ రాంబాబు
రీ రికార్డింగ్: రాజు
డి ఓ పి: డి యాదగిరి
నిర్మాత, దర్శకత్వం: శెట్టిపల్లి శ్రీనివాసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here