సినిమా.. సమాజాన్ని కదిలిస్తుంది. షార్ట్‌ఫిల్మ్ కొత్త ఆలోచనకు ప్రాణం పోస్తుంది. ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న ప్రతిభావంతులను వెలికితీస్తోంది. ఇక్కడ కళ.. కళద్వారా సందేశం అందించే అవకాశం సైబరాబాద్ పోలీసులకు కల్పిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిలో ఎక్కువగా మరణించేవారు ఎవరో తెలుసా.. పెడస్ట్రియన్లు.. అంటే రోడ్డుదాటుతూ.. బలయ్యే పాదచారులు. వీరిని కాపాడేందుకు.. జాగ్రత్తలు చెప్పేందుకు అనువుగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సెల్(ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పాదచారులకు అవగాహన.. సందేశం ఇచ్చేవిగా లఘుచిత్రాలు ఉండాలి. దీనిలో ఉత్తమ బహుమతి ఎంతో తెలుసా రూ.50,000 రెండోది రూ.30,000, మూడో బహుమతి రూ.20,000 మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రియేటివ్ బ్రెయిన్‌కు
పదన పెట్టండి.. మీలో సత్తాను బయటకు తీయండి.. తెలుగు/ఇంగ్లిషు భాషల్లో ఏదైనా పర్లేదు. రేపటి లక్ష్యాన్ని దీన్నే వేదికగా మలచుకోండి. వివరాలకు.. ఈ పోస్టర్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 15వ తేదీలోగా మీ చిత్రాన్ని సబ్మింట్ చేయాలి.