సోము వీర్రాజు ఎందుకు ఒత్తిడి పడుతున్నారు. అసలు ఎందుకింత అసహనానికి గురవుతున్నారు. బీజేపీ అదిష్ఠానం ఏమైనా హింట్ ఇచ్చిందా! ఏదైనా పార్టీలో లోపాయికారీ ఒప్పందం జరుగుతుందా! అమిత్‌షా త్రయం నుంచి ఏమైనా వార్నింగ్ వచ్చిందా! లోకల్ వార్‌తో హీటెక్కిన ఏపీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్స్ మరింత హీటు పుట్టిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీను సీఎం చేస్తానంటూ ఎందుకీ కొత్త వాదన తెరమీదకు తెచ్చారనేది ఆసక్తిగా మారింది. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగేటట్టయితే ఈ మాట అనొచ్చా.. లేదా అనేది ఆ పార్టీ వ్యక్తిగత. కానీ.. జనసేనతో కలసి ముందడుగు వేయాలనే వ్యూహంతో ఉన్న పార్టీల మధ్య ఎటువంటి చర్చ జరగకుండా ఎందుకిలా నోరుజారారనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
వాస్తవానికి సోము వీర్రాజుకు చిరంజీవి, పవన్ ఆశీస్సులున్నాయి. జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా సోమున్న పట్ల సానుకూలంగానే ఉంటున్నారు. కానీ.. ఆయనే తరచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సేనాని పవన్ కళ్యాణ్‌ను కూడా ఇరుకున పెడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేనకు గెలిచే అవకాశం ఉందనేది పార్టీ అంతర్గత చర్చలో గుర్తించిన అంశం. బీజేపీ కూడా అక్కడ నెగ్గటం ద్వారా 2024కు దారి సుగుమం చేసుకోవాలని బావిస్తోంది. ఇరు పార్టీలు చర్చించుకుని నిర్ణయానికి రావాల్సిన సందర్భంలో తామే బరిలో నిలుస్తామంటూ బీజేపీ తరపున సోమన్న ప్రకటించటం జనసేన అభిమానులకు ఆగ్రహం కలిగించింది. ఇప్పుడు మరోసారి పవన్ నాయకత్వాన్ని కోరుకంటున్న జనసైనికుల మనోభావాలు దెబ్బతినేలా.. బీజేపీ సీఎం అభ్యర్థిగా బీసీ ను ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు సోము వీర్రాజు. ఈ లెక్కన… రెండు పార్టీలు కలసి పోటీచేసి ఒకవేళ మెజార్టీ సీట్లు సాధించినా పవన్‌ను సీఎం చేయలేమనేది చెప్పకనే చెప్పినట్టయింది. ఈ లెక్కన.. పవన్‌తో కటీఫ్ చెప్పటం ద్వారా తాము ఏ పార్టీతో అంటగాకపోతున్నారనేది చెప్పలేకపోయారు. కానీ.. మాజీ నేతలు మాత్రం కాషాయ కండువా కప్పుకునేందుకు రెఢీగా ఉన్నారంటూ చెప్పారు. బీసీ సీఎం అంటూ అన్ని పార్టీలను ఇరుకున పెట్టారు. మరి సేనాని ఎందుకింత పలుచన చేయాలని కంకణం కట్టుకున్నారనేది సోమన్నే చెప్పాలి.



