Home సినీలోకం “సన్ ఆఫ్” చిత్ర రివ్యూ & రేటింగ్

“సన్ ఆఫ్” చిత్ర రివ్యూ & రేటింగ్

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి నిర్మాతగా బత్తుల సతీష్ రచనా దర్శకత్వంలో ఫిబ్రవరి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సన్ ఆఫ్. వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో సాయి సింహాద్రి హీరోగా పరిచయం అవుతూ మీరా రాజ్ హీరోయిన్గా నటించారు. వి ఆర్ కె నాయుడు సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి రిషి ఎం సంగీతం అందించారు. వాసు ఇంటూరి, లోకేష్ కుమార్ పరిమి తదితరులు మంచి పాత్ర పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

 

కథ :

చిన్నప్పటినుండి తల్లి లేని తండ్రి పెంపకంలో పెరిగిన కుమారుడికి తన తండ్రికి ప్రతి విషయంలోనూ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అలా ఉన్న అతని జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఏ పని చేయని ఆ కుమారుడు తన ఇంటిని నమ్ముకుని ఉంటారు. కానీ ఆ ఇంటిని అమ్మటం వంటివి అతని తండ్రికి ఇష్టం లేదు. అయితే ఆ అమ్మాయి ఇతని జీవితంలో ఉంటుందా లేక వెళ్ళిపోతుందా? ఆ అమ్మాయి వల్ల అతని జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? అసలు ఆ ఇల్లు అతనికి దక్కుతుందా లేదా? ఇంటి కోసం కోర్టుకు వెళ్లేంత అవసరమేంటి? ఇంటి కోసం తండ్రీ కొడుకులకు వచ్చిన చాలెంజ్ ఏంటి? చివరికి ఆ తండ్రి కొడుకులు ఒకటి అవుతారా? అని అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

నటీనటుల నటన :

తొలి చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన సాయి సింహాద్రి చాలా న్యాచురల్ గా అద్భుతంగా నటించారు. ఎక్కడ కూడా కొత్త హీరోల కాకుండా ఒక మంచి ఆర్టిస్టులాగా సాధారణమైన పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. హీరోయిన్ మీరా రాజ్ తన పాత్ర పరిధిలో ఎమోషన్ నుండి యాక్టింగ్ వరకు ప్రతి విషయంలోనూ చాలా బాగా పెర్ఫాం చేశారు. అచ్యుతుల అమ్మాయి లాగా కనిపిస్తూ ప్రేక్షకుల మన్నన పొందారు. తండ్రి పాత్రలో వినోద్ కుమార్ ఇప్పటికే ఎన్నో చిత్రాలలో కనిపించారు. ఇటీవల ఇలాగే తండ్రి పాత్రలో ఆయ్ సినిమాలో కనిపించారు కానీ ఈ సినిమాలో ఆయన పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అటువంటి భిన్నమైన పాత్రలో ఆయన చాలా బాగా నటించారు. అలాగే సపోర్టింగ్ పాత్రలలో వాసు ఇంటూరి, లోకేష్ చిత్రం అంతటా ప్రేక్షకులకు కనిపిస్తూ మెప్పించారు. చిత్రంలో కనిపించిన ఇతర నటీనటులు అంతా తమ తమ పాదాల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు.

 

సాంకేతిక విశ్లేషణ :

ఒక చిన్న టౌన్ లో జరిగే తండ్రి కొడుకుల మధ్య కథను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని మెప్పించడం అంటే ఎమోషన్ వర్క్ అవడం ఒక ఛాలెంజ్. అటువంటి ఛాలెంజింగ్ కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా రాసుకోవడమే కాకుండా దానిని పర్ఫెక్ట్గా వెండితెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. అలాగే ఆ కథను కెమెరాలో చూపించడంలో డిఓపి విజయం సాధించారు. న్యాచురల్ లొకేషన్స్ ను అందంగా చూపిస్తూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణ అని కంటికి కట్టినట్లు చూపించారు. సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పాటలు చాలా బాగున్నాయి. హీరో డాన్స్ అదరగొట్టారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే కలరింగ్, చిన్నపాటి విఎఫ్ఎక్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించడం లేదు.

 

ప్లస్ పాయింట్స్ :

కథ, నటీనటులు నటన, లొకేషన్స్, సాంగ్స్.

 

మైనస్ పాయింట్స్ :

కొత్త నటీనటులు కావడం, కొన్ని సీన్లు స్లోగా ఉండటం.

 

సారాంశం :

తండ్రి కొడుకుల మధ్య ఉండే ఓ సన్నని పొరను చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తూ వారి మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపిస్తూ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం సన్ ఆఫ్.

 

రేటింగ్ : 2.5/5

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here