అంగరంగ వైభవంగా మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం 

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం నందు నిన్న రాత్రి మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకుడు, సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీ బండి సంజయ్‌ కుమార్‌, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీ రఘురామకృష్ణం రాజు, శ్రీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి, శ్రీ అరికపూడి గాంధీ, శ్రీ ఏలూరి సాంబశిరావు, శ్రీ శివసేనా రెడ్డి తో పాటు చిత్ర పరిశ్రమ నుండి విజయేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, అనన్య నాగెల్లా, ఆకాష్ పూరి, శివ బాలాజీ & మధుమిత, రాకింగ్ రాకేష్ & జోర్దార్ సుజాత, దామోదర్ ప్రసాద్, మానస వారణాసి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి పరవశంలో మునిగితేలారు.

ఈ సందర్భంగా మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ… “ఈరోజు శ్రీ శ్రీనివాస కళ్యాణం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఇరు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని. నా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారి క్షేమం కోరుకునే వ్యక్తిని. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన వారి అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అండగా నిలబడిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు, వాలంటీర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాస కళ్యాణం కోసం తిరుపతి నుండి వచ్చి స్వామి వారిని మా అందరికి ముందు తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవాని నిర్వహించిన టిటిడి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారికి, కళ్యాణం నిర్వహించిన సుదర్శన్ దీక్షితులు గారికి, గోవిందరాజు గారికి, వేద పండితులకు, ఇతర టిటిడి స్టాఫ్ కు మరొక సారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

Previous articleవిఆర్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న “ఓం హరుడు” సినిమా నుంచి ‘ఉప్పు కప్పు రంబు’ సాంగ్ ని లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here