మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకు కరోనా నిర్ధారణైంది. ఇటీవలే తమన్నా తల్లిదండ్రులు కూడా కొవిడ్19కు గురయ్యారు. వైద్యచికిత్స ద్వారా కోలుకున్నారు. ఆ తరువాత తమన్నా కూడా వైరస్ భారీనపడినట్టు ప్రకటించారు. తీవ్రజ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్యపరీక్షలు చేయటంతో కొవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమా కరోనా వల్ల గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంను కోల్పోయింది.