నందమూరి బాలకృష్ణ ను అభినందించిన తెలుగు సినీ సంస్థలు

నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఎప్పుడూ ముందంజలో ఉంటారు. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్ తో బిజీగా ఉండి కూడా ఎంతోమందికి సేవలందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఇటీవల వరస మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డారు. అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ లీడర్ అనిపించుకున్నారు అదేవిధంగా ప్రజలకు ఎన్నో విధాలుగా ఎంతో సేవ చేస్తున్నారు.

2024 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపిన తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు శ్రీ కె. ఎల్. దామోదర్ ప్రసాద్ గారు, కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్ గారు, మరియు ఈసీ మెంబర్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు) గారు, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు) గారు, కార్యదర్శి శ్రీ కె. ఎల్. దామోదర్ ప్రసాద్ గారు మరియు కోశాధికారి శ్రీ టి. ప్రసన్నకుమార్ గారు, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కె. అనుపం రెడ్డి గారు మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు.

Previous article“Police Vari Heccharika” Title logo launched by Director Teja
Next articleమూడవసారి ఎంఎల్ఎ గా గాలించిన బాలయ్యకు అభినందనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here