అత్యాధునిక ఆయుధాలు.. సెకన్‌కు వందలాది బుల్లెట్ట వర్షాన్ని కురిపించే తుపాకులు. గర్జించే శత్నఘ్నులు. దూసుకెళ్లి మిసైళ్లు.. భారీ కవాతుతో సైన్యం బూట్ల చప్పుడుకు ఉలిక్కిపడుతున్న హిమశిఖరాలు. నువ్వానేనా.. కాచుకో అంటూ రొమ్మువిరుచుకుని కథనానికి సై అంటూ సవాళ్లు విసుకుంటున్న ఇరు దేశాల సైనికులు. ఒక్క ఆదేశం చాలు.. రెప్పపాటులో సరిహద్దుల అవతలకు దూసుకెళ్లేందుకు రెఢీ అంటున్న భారత సైనికులు. ఏక్షణమైనా యుద్ధం తప్పదంటూ అంతర్జాతీయ సమాజం ఉలికిపాటు. నిజమే.. ఇదంతా ఏదో ఉబుసుపోకుండా రాసిన అంశాలు కాదు. అంతర్జాతీయ, జాతీయ మీడియా ఇస్తున్న నివేదిక. సమాచారం గోప్యం. కానీ.. ఇదే అదను దెబ్బతీయటమో.. అవకాశం దొరక్కగానే విరుచుకుపడటమో చేసేందకు భారత సైన్యం సర్వ సన్నద్ధమైంది.
లడ్డాఖ్ ప్రాంతం గుంబనంగా మారింది. రఫెల్ యుద్ధవిమానాలు అక్కడే ఉన్నాయి. టీ22 యుద్ధట్యాంకులు కూడా మోహ రించాయి. ఆకాశ్ మిస్సైళ్లు, అగ్ని, బ్రహ్మోస్ వంటి వాటిని సంసిద్ధం చేస్తున్నారు. ఏ క్షణమైనా పరిణామాలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. అందుకే.. లడ్డాఖ్‌లో దాదాపు 50,000 మంది సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. సాయుధులైన వీరంతా క్షణంలో యుద్ధభూమిలోకి దూకేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వీరిని కాపాడుకుంటూ.. శత్రువుల కదలికలు.. విమాన దాడుల నుంచి సంరక్షించేందుకు యుద్ధవిమానాలు, రాడార్ వ్యవస్థలు కూడా రెడీ అయ్యాయి. చైనా ఆర్మీ కూడా దాదాపు లక్షమందిని రంగంలోకి దింపింది. తాను కూడా తక్కువేం కాదంటూ సవాల్ విసురుతోంది. శీతాకాలం ప్రారంభంతో మంచు పెరుగుతుంది. దీనికి తగినట్టుగా.. భారత సైనికులకు అవసరమైన మందులు, మందుగుండు సామాగ్రి, వైద్యం, బ్లడ్‌బ్యాంకులు ఏర్పాటు చేశారు.
చైనా కూడా మాజీ ఆర్మీ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైంది. భారత్‌ను తక్కువ వేస్తే.. ఇండియన్ ఆర్మీ చైనాలోకి దూసుకు వస్తుందనే అభద్రతకు గురైంది. అందుకే.. అంతర్జాతీయంగా పరువు పోతుందనే భయంతో మేకపోతు గాంభీర్యం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. హైబ్రీడ్ వార్‌తో ఇండియా సైబర్ వ్యవస్థను దెబ్బతీయాలనే ప్లాన్ కూడా బెడసి కొట్టడంతో ప్లాన్ -బి అమలు వైపు అడుగులు వేస్తుంది. మరోవైపు ప్రపంచదేశాలు కూడా భారత్ వైపు బాసటగా నిలవటం కూడా చైనాను భయపెడుతున్నాయి. అక్టోబరు నెలలో మరో ఐదు రఫెల్ యుద్ధవిమానాలు భారత్‌కు రానున్నాయి. ఇజ్రాయేల్, రష్యా నుంచి కూడా కొన్ని రకాల ఆయుధాలు సైన్యం చేతికి వస్తాయట.
సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా రంగంలోకి దిగబోతుంది. ఇద్దరికీ మిత్రదేశం కావటంతో రష్యా మధ్యవర్తిత్వం సానుకూల ఫలితాలను ఇస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో కూడా ఇండియా, చైనా, రష్యా పరిస్థితులు అక్కడి అధ్యక్ష ఎంపికపై ప్రభావం చూపనున్నాయి. కాబట్టి.. ఈ విషయంలో అమెరికా వైఖరి. ముఖ్యంగా ట్రంప్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఏమైనా.. చైనాకు ఈ సారి గట్టి గుణపాఠం చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ రెఢీగా ఉందనేది వాస్తవం. సరిహద్దుల్లో.. ప్రాణాలొడ్డి నిలబడిన ప్రతి ఒక్క సైనికుడికీ జైజేలు పలకాల్సిందే.