భారత సరిహద్దుల్లో టెన్షన్ మరింత పెరుగుతోంది. క్షణక్షణానికి అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. చైనా కూడా భారీగా బలగాలను తరలిస్తోంది. ఫింగర్ 4 వద్దకు దాదాపు లక్ష మంది పదాతిదళం సిద్ధంగా ఉంది. బాలిస్టిక్ క్షిపణులను మోహరించింది. ఏక సమయంలో 150 యుద్ధవిమానాలతో భారతసేనపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా రక్షణవర్గాలు లెక్కలు కడుతున్నాయి. దీనికి ధీటుగా బదులిచ్చేందుకు భారత్ కూడా సిద్ధమైంది. తాజాగా ఐదు రఫేల్ యుద్ధవిమానాలు వాయుసేనలోకి చేరాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వాటిని లాంఛనంగా ప్రారంభించారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం నేపథ్యంలో రాఫెల్ యుద్ధవిమానాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అయితే ఫాంగాంగ్ సరస్సు, లడ్డాఖ్ పర్వతప్రాంతాల్లో భారతసేన పై భాగంలో ఉండటం కలసివచ్చే అంశం. ఒకవేళ భారత్‌పైకి చైనా దాడికి తెగబడితే పర్వాతాలపై ఉన్న యుద్ధట్యాంకులు, శతఘ్నుల సాయంతో శత్రువులపై పై చేయి సాధించటం తేలిక అవుతుంది. అందుకే.. దీన్ని అధిగమించేందుకు చైనా వాయుసేనపై పూర్తిగా ఆధారపడబోతుందనేది రక్షణ వర్గాల చెబుతున్నమాట.
ఏమైనా.. పర్వత ప్రాంతంలో యుద్ధం చేయటం అంత ఆషామాషీ కాదు.. 1999లో కార్గిల్ యుద్ధంలో భారత్ పన్నిన వ్యూహాలు.. పాకిస్తాన్‌ను చావుదెబ్బ తీయటంలో ఉపయోగించిన యుద్ధతంత్రాలను చైనా పై కూడా ప్రయోగించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఏమైనా.. చైనా-భారత్ రెండూ అణ్వాయుధ దేశాలు.. ఎవరు తొందరపడినా భారీగా ప్రాణనష్టం జరుగుతుందనేది ప్రపంచాన్ని భయపెడుతున్న అంశం. రష్యా దీనిపై మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా, భారత్ రెండింటికీ మిత్రదేశమైన రష్యా.. ఒకవేళ వార్ వస్తే తటస్థంగా ఉండవచ్చు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఉత్తరకొరియా, ఇజ్రాయేల్ వంటి శక్తివంతమైన దేశాలు ఆయుధసాయం, టెక్నాలజీ తోడ్పాటుతో భారత్‌కు అండగా నిలువనున్నాయి. ఏమైనా.. భారత్‌తో మాత్రమే తాను యుద్దం చేయాలనుకుంటున్నచైనాకు.. ఇప్పుడు భారత్ మిత్రదేశాలు కూడా జతకడతాయనే భయం కాస్త వెనక్కిలాగుతోందట.