శాంతిని ఆహ్వానిద్దాం.. యుద్ధమే కావాలంటే రుచిచూపుదాం. అహింసామంత్రం నచ్చని చీనీయులు మరచిపోలేని విధంగా చేద్దాం. భారత్ అంటే ఒంటికాలిపై లేచే పాకిస్తాన్‌కు కార్గిల్‌తో వణకు పుట్టించాం. కాషాయం కప్పుకున్న నేతకు భయపడాలా! అని నరేంద్రమోదీను తేలికగా తీసుకున్నపాక్‌కు సర్జికల్ స్ట్రయిక్‌తో మరోసారి మువ్వన్నెల జెండా వైపు చూసేందుకు భయపడేలా చేశాం. ప్రపంచంలో తానే నెంబర్ 1నే అతి ఆత్మవిశ్వాసంతో సమరానికి కాలుదువ్వుతున్న చైనాకు బుద్ది చెప్పేందుకు భారతీయ సేన సర్వసన్నద్ధంగా ఉంది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ సరిహద్దుల వద్ద చేస్తున్న కవ్వింపును సునిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ లక్ష మంది సైనికులను సరిహద్దుకు తరలించింది. 20-30 వరకూ యుద్ధవిమానాలు ఏ క్షణమైనా గాల్లోకి లేచేందుకు సిద్ధంగా ఉన్నాయి.. యుద్ధతంత్ర నిపుణుడు.. శత్రువుల గుండెల్లో శతఘ్నిలాంటి అజిత్‌దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చైనాను దెబ్బతీయటం ఆషామాషీ కాదు.. బలం.. బలగం.. ఆయుధ సంపత్తితో పోల్సితే మనకంటే రెండు మూడ రెట్లు అధికంగా ఉంది. కానీ.. అపారమైన ఇండియన్ సైనికుల అపార ధైర్యసాహసాలు వారిని వెనుకంజ వేసేలా చేస్తున్నాయి. అయినా.. చైనా వ్యూహాలను తక్కువగా తీసుకోలేం.. అన్నింటా పట్టున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎటు నుంచైనా భారత్‌ను దెబ్బతీసేందుకు సిద్ధపడింది. ఇన్ని వ్యూహాలకు ప్రతివ్యూహం ఎంతగా ఉండాలనేదానిపై యుద్ధతంత్ర నిపుణులతోపాటు.. గత యుద్ధాల తాలూకూ అనుభవాలను పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 2000 మంది వరకూ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. పర్వతప్రాంతాలు.. ఎత్తయిన ప్రదేశాల్లో ఉండి శత్రువుల గుండెల్లో తూటాలు, అవసరమైతే కత్తులు దించగల దిట్ట వీరి సొంతం. ఇండియన్-భూటాన్‌కు చెందిన వీరి శక్తిసామర్థ్యం చైనాకు మరింత సవాల్. అయితే గాల్వాన్ లోయతోపాటు.. ఎల్ ఏ సీ(లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్) వద్ద 7-8 ట్రక్కుల నిండా సైన్యంతో చైనా కదలికలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. యుద్ధట్యాంకులను కూడా భారిగానే తరలిస్తుంది. ఫాంగాంగ్ సరస్సు వద్ద చైనా-ఇండియన్ ఆర్మీ కొద్దిరోజుల ముందు ముఖాముఖి తలపడ్డాయి. ఇరు దేశాలకు కీలకమైన ఇదే ప్రాంతంలో 1962లో భారీగా నష్టం జరిగింది. మరోసారి చైనా ముందుకు చొచ్చుకు వస్తే.. ఈ ప్రాంతమే కీలకం కావచ్చని ఇండియన్ ఆర్మీ అంచనా వేస్తోంది. తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అత్యవసర బేటీ నిర్వహించారు. సరిహద్దుల వద్ద ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధీటుగా బదులిచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సన్నద్ధంగా ఉందని స్పష్టంచేశారు.