TFCC నూతన అధ్యక్షుడు భరత్ భూషణ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ : ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా కలవడానికి అవకాశం ఇచ్చి ముచ్చటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు సహాయం అందుతుందని ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ : తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భరత్ భూషణ్ గారికి అభినందనలు. నా అమెరికా పర్యటన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు.

Previous articleతెలుగు చలనచిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్
Next articleవిజయ్ సేతుపతి నటించిన “సూపర్ డీలక్స్” ఈ నెల 9న థియేటర్లో విడుదల కానుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here