మెగాస్టార్ చిరంజీవి.. వెండితెర పై తిరుగులేని రారాజు. మూడున్నర దశాబ్దాలుగా నెంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుప్రీం. ఆయనతో సినిమా కోసం.. దర్శకులు, నిర్మాతలు క్యూ కడతారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు ఎన్ని కోట్లయినా కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నవారెందరో ఉన్నారు. సినీ ప్రపంచంలో మెగాస్టార్‌తో సినిమా చేయాలనేది యువ దర్శకుల డ్రీమ్. సంగీత దర్శకులు కూడా చిరు సినిమాతో తమలోని కోరికను తీర్చుకోవాలని పరితపిస్తుంటారు. ఖైదీనెంబరు 150, సైరా నరసింహారెడ్డి వంటి హిట్ల తరువాత ఆచార్యతో హ్యాట్రిక్ కొట్టడం అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఆ తరువాత లూసిఫర్ రీమేక్ కోసం చర్చలు మొదలయ్యాయి. దర్శకుడు ఎవరనేది పూర్తిగా తేలకుండా ఉంది. అయితే తాజాగా లూసిఫర్ రీమేక్‌కు సంగీత దర్శకుడుగా థమన్ పనిచేయబోతున్నారు. మెగాస్టార్‌తో జర్నీ మొదలైందంటూ ట్వీట్టర్ ద్వారా థమన్ వెల్లడించారు. మ్యూజికల్ జర్నీ బాస్‌తో మొదలైందంటూ చెప్పుకొచ్చారు. ఆనందాన్ని పంచుకున్నారు.
https://twitter.com/MusicThaman?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor



