‘పేకమేడలు’ సినిమా నుండి తొలి చిత్రం విడుదల చేసిన మూవీ టీం

నా పేరు శివ, మిల్లర్ తదితర సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన వినోద్ కిషన్ తొలిసారి తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నారు. క్రేజీ అంట్స్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమా పేరు ‘పేకమేడలు’. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ యూత్ లో మంచి బజ్ తెపించింది. ఈ సినిమాతో లక్ష్మణ్ పేరుతో మన ముందుకు రాబోతున్నాడు వినోద్ కిషన్. రాకేష్ వర్రే నిర్మిస్తున్న ఈ సినిమాకు నీలగిరి మామిళ్ళ దర్శకత్వం చేస్తున్నారు. హరిచరణ్ కే కెమరామెన్ గా పని చేస్తున్న ఈ సినిమాకు స్మరన్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు.

పేకమేడలు సినిమా నుండి ‘బూమ్ బూమ్ లచ్చన్న’ అంటూ తొలి చిత్రం విడుదల అయింది. ఈ పాటకు స్మరన్ సాయి ట్యూన్ అందించగా మనో తన స్వరాన్ని అందించారు. భారగవ కార్తీక్ ఈ పాటకు లిరిక్స్ అందచేశారు.

ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా అనూష బోర వ్యవహరించగా కేతన్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సృజన అడుసుమిల్లి, హంజా అలీ ఈ సినిమాకు ఎడిటింగ్ చేసారు. మధు విఆర్ ఈ సినిమాకు పిఆర్ఓ గా పని చేసారు.

Previous articleEVOL మూవీ కి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ సందర్భంగా సెన్సేషనల్ ప్రెస్ మీట్
Next articleపాన్ ఇండియా స్థాయిలో సాయి దుర్గ తేజ్ సరికొత్త సినిమా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here