గండికోట క్రియేషన్స్ శ్రీనివాస్ గారు లేటెస్ట్ అలాగే నిర్మాతగా వ్యవహరిస్తూ గని సైదా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఏరేరో ఏరో పాటను నేడు లాంచ్ చేయడం జరిగింది. ఈ పాటకు దుర్గా బహదూర్ సంగీతాన్ని అందించగా రోహిత్ బిహారి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ ఇతర సాంకేతిక కార్యక్రమాలు చేశారు. చక్రి ఈ పాటకు తన స్వరాన్ని అందించారు. వరుణ్ రంగిశెట్టి ముఖ్య పాత్ర పోషించారు.
ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బండ ప్రకాష్ గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఒక తల్లిని ఆధారంగా తీసుకొని తల్లి అంతిమ గడియలలోని సందర్భాన్ని వివరిస్తూ వచ్చిన ఈ పాట అద్భుతంగా ప్రేక్షకుల ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. ఈ పాటలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడిన బృందం అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎంతో గొప్ప సబ్జెక్టును సెలెక్ట్ చేసుకుని ఈ పాటను చేశారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నేను పాల్గొనందుకు గాను గర్విస్తున్నాను” అన్నారు.
నటుడు కరాటే కార్తి మాట్లాడుతూ… “ఈ పాటను నేను చూడడం జరిగింది. పాటలో నటించిన వారిని గుర్తుపట్టలేనంతగా ఉన్నారు. పాటను చూసి నేను ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. కళ్ళలో నీళ్లు తిరిగాయి. మొదటిసారి ఒక పాటను పాన్ ఇండియా స్థాయిలో చూస్తున్నాను. బృందం అందరికీ నా శుభాకాంక్షలు” అన్నారు.
అభయ్ నవీన్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. ఈ పాట చాలా బాగుంది. ముందుగా ఇటువంటి పాటకు డబ్బు కోసం వెనకాడకుండా ఖర్చుపెట్టిన నిర్మాతలకు శుభాకాంక్షలు తెలపాలి. కేవలం ఐదు నిమిషాలలో ఒక పాటలో కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించడం చాలా కష్టం కానీ దర్శకుడు ఆ విషయంలో విజయం సాధించారు. సౌండ్ డిజైన్, కెమెరా వర్క్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలను అన్ని చాలా అద్భుతంగా కుదిరాయి. ప్రేక్షకులు ఈ పాటను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు గని మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, మీడియా వారికి అందరికీ థాంక్స్. నేను ఈ పాట చేసేందుకు నాకు అండగా నిలబడిన నిర్మాతకు చాలా థాంక్స్. అలాగే ఈ ప్రాజెక్టులో నాకు అండగా నిలబడి ప్రతి విషయంలో సహకరిస్తూ ఈ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తోడ్పడిన నా బృందం అందరికీ, అలాగే నటీనటులకు పేరుపేరునా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను గత ఏడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇలాగే ముందుకు వెళ్తూనే ఉంటాను. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదములు అనుకుంటున్నాను” అంటూ ముగించారు.