కరోనా కారణంగా అన్ని రంగాలు అనేక రకాలుగా నష్ట పోయాయి, దీనికి రైతులు కూడా బాధితులే, ఇటువంటి కష్ట సమయంలో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఇలాంటి సమయంలో రైతులకు అన్నిరకాలుగా సహాయం అందించడంలో ముందుండే 3 ఎఫ్ ఆయిల్ పామ్ సంస్థ రైతులకు ఆయిల్ పామ్ గెలలను ఫ్యాక్టరీకి తరలించేందుకు అయ్యే ఖర్చు రవాణా ప్రోత్సాహకం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఇంధన ధరలు పెరగడం వలన గెలలను ఫ్యాక్టరీకి తరలించే రైతులకు మరింత సహాయం చేయాలనీ ఈ రవాణా ప్రోత్సాహకం పెంచి ఇస్తున్నారు. దీని ద్వారా రైతులు తమ పంటలను రవాణా చేయడానికి అయ్యే వ్యయం మరింత కలిసివస్తుంది.
” 3 ఎఫ్ ఆయిల్ పామ్ సంస్థ రైతుల ఆర్థిక పరిస్తులను అర్థంచేసుకుని వారికి అనేక రకాలుగా సహాయం చేస్తుంది. ఈ కరోనా సమయంలో కూడా ఆర్థికంగా మేలు చేయాలనే ఉద్యేశంతో ఈ రవాణా ఇన్సెంటివ్ పెంచడం జరిగిందీ. దీని వలన రైతులు తప్పకుండా లబ్ది పొందుతారు అని 3 ఎఫ్ ఆయిల్ పామ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గోయెంకా గారు తెలిపారు.”
గెలల రవాణా ప్రోత్సాహకం కనిష్టంగా 175 రూపాయల నుండి గరిష్టంగా 300 రూపాయల వరకు పెంచడం జరిగింది. సెప్టెంబర్ 1 తేదీ నుండి అమలులోకి వస్తుంది.
పెరిగిన గెలల రవాణా ప్రోత్సాహకం వివరాలు ఇలా ఉన్నాయి
5 కిలోమీటర్ లోపు దూరంలో ఉన్న రైతులకు పాత దర రూ. 125 చెళ్ళిస్తుండగ ఇప్పుడు రూ. 175 ఇవ్వడం జరుగతుంది.
6 నుంచి 10 కిలోమీటర్ రవాణా ప్రోత్సాహకం పాత దర రూ.150 నుంచి రూ. 200 కి పెంచారు. 11-15 కిలోమీటర్ల వారికి పాత దర రూ.210 నుండి రూ.260 కి పెంచారు.
16 – 20 కిమి వారికి పాత దర రూ. 210 నుండి రూ. 275 పెంచారు.
20 కిలోమీటర్ల పైన వారికి
పాత దర రూ. 215 నుండి రూ. 300 పెంచడం జరిగింది.