దుబ్బాక ఉప ఎన్నిక నువ్వానేనా అనేట్టుగా ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తిగా మారుతోంది. ఆరో రౌండ్‌లో స్వల్ప ఆధిక్యత సాధించిన టీఆర్ ఎస్ మున్ముందు ఇదే దూకుడు కొనసాగిస్తా మంటోంది. కాంగ్రెస్ అభ్యర్ధి అసలు డిపాజిట్లు సాధిస్తారా! అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగింది. టీఆర్ ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. టీఆర్ ఎస్ ఊహించినట్టుగా గాకుండా భిన్నంగా బీజేపీ మరింత పుంజుకుంది. హరీష్‌రావు మంత్రాంగం అక్కడ ఏమీ ఫలించినట్టుగా కనిపించట్లేదు. దుబ్బాకలో మాత్రమే తమకు ప్రతికూలత ఉంటుందని టీఆర్ ఎస్ భావించింది. కానీ.. ఇంత ఘాటుగా దెబ్బతీస్తుందని భావించలేకపోయింది. ఆరో రౌండ్ నుంచి టీఆర్ ఎస్ హవా మొదలైనట్టుగా టీఆర్ ఎస్ నేతలు చెబుతున్నారు. 303 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు. టీఆర్ ఎస్ ఆరో రౌండ్ నుంచి మెరుగు పడేందుకు కారణాలు పల్లె ఓటర్లు కావటమే… విద్యావంతులు, ఉద్యోగులు తదితర పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. దీంతో ఐదురౌండ్ల వరకూ వారికే మెజార్టీ ఓట్లు వచ్చాయి. ఇక నుంచి పల్లె ఓటర్ల ఓట్లు లెక్కింపు మొదలు కానుంది. గ్రామీణ ప్రాంతాలన్నీ టీఆర్ ఎస్‌కే జైకొడతాయని ధీమాగా ఉన్నారు. రైతుబంధు, సాగునీటి పథకాలు ఇవన్నీ కారు గుర్తును తేలికగా బయట పడేస్తాయంటున్నారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. టీఆర్ ఎస్ మాత్రం.. పూర్తిగా పల్లె ప్రజలపైనే నమ్మకం పెట్టుకుందన్నమాట. అదే నిజమై.. టీఆర్ ఎస్ గెలిస్తే.. మరి రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందనే గుబులు కూడా టీఆర్ ఎస్‌లో లేక పోలేదు.దుబ్బాకలో గెలిచినా.. ఓడినా.. టీఆర్ ఎస్‌కు మాత్రం చలి వణకు తప్పదేమో!