పాట‌కు ప‌ట్టాభిషేకం

పాట‌.. ఆట‌తో ఆక‌ట్టుకునే ప్ర‌జాగాయ‌కుడు గోర‌టి వెంక‌న్న‌కు తెలంగాణ స‌ర్కారు స‌ముచిత గౌర‌వం ఇచ్చింది. సామాజిక వ‌ర్గాల‌ను స‌మీక‌రించేలా ముగ్గురుకి ఎమ్మెల్సీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం వీరి పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదానికి పంపింది. తెలంగాణ‌లో మూడు ప్ర‌భుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భ‌ర్తీ చేయాల‌ని ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో ఆశిస్తుంది. చాలామంది ఆశ‌వ‌హులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. తాజాగా రాష్ట్ర మంత్రివ‌ర్గం స‌మావేశంలో ముగ్గురుఎమ్మెల్సీల భ‌ర్తీపై నిర్ణ‌యం తీసుకుంది. వీరిలో ప్ర‌ముఖ వాగ్గేయ‌కారుడు గోర‌టి వెంక‌న్న‌, మాజీ మంత్రి, ర‌జ‌క సంఘ నేత బ‌స్వ‌రాజు సార‌య్య‌, ఆర్య‌వైశ్య సంఘ నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొందాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here