అక్సిజన్ ఆగి ఊపిరిపోతే.. అబ్బే కారణం అది కాదంటారు. సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపి సర్టిఫికెట్ కావాలంటారు. లోపల ఊపిరాడక కొట్టుమిట్టాడే కరోనా రోగులను చూసి కూడా కనికరించనంత కఠినంగా మారారు. చివరకు హైకోర్టు మందలించినా వీళ్ల తీరు ఇలాగే ఉంది. ఏపీ, తెలంగాణ తెలుగు నాట కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉండోతుందనేది గుబులు రేకెత్తిస్తోంది. కోర్టులు మొట్టికాయలు వేస్తే తప్ప పాలకుల కళ్లు తెరవట్లేదు. నిర్ణయాలు తీసుకోవటంలో నిర్లక్ష్యంగా ఉండటం చూస్తుంటే ఎన్నికలపై ఉన్న శ్రద్ధ లేనట్టుగా ఉంది. ఏపీలో కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అక్కడ ఆసుపత్రులు చాలక హైదరాబాద్ వస్తున్నారు. రోగులు. ఇప్పటికే హైటెక్ సిటీలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు రోగులతో నిండాయి. పైరవీలు, రికమండేషన్ లేనిదే బెడ్‌లు దొరకని పరిస్థితి. అయినా ఏదో విధంగా అంబులెన్స్‌లు మాట్లాడుకుని తమ వారిని కాపాడుకునేందుకు వస్తున్నవారిని ఏపీ, టీఎస్ సరిహద్దుల వద్ద పోలీసులు నిర్దాక్షణ్యంగా నిలిపివేస్తున్నారు. దీనిపై హైకోర్టు మందలించినా అదే పరిస్థితి. తెలుగు నేతల మద్య రాజకీయ రచ్చ ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మరి దీనిపై తెలుగు సీఎంలు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి. లాక్‌డౌన్ నిర్బంధాన్ని అవకాశం చేసుకుని జనాన్ని ఇంకెంతగా ఇబ్బందులకు గురిచేస్తారనే భయం కూడా తెలుగు ప్రజల్లో మొదలైంది.