“వి” ..టామ్ అండ్ జెర్రీ ల వైలెంట్ థ్రిల్లర్

“నానీ మా ఇంట్లో అబ్బాయి” అనుకునే సగటు తెలుగు ప్రేక్షకుడికి ఒక గమనిక..!! క్షమించండి మీరు ఆ నానీ ని చూడలేరు ఇక్కడ . అలా అని నానీ కోసమే మీరు ఈ సినిమాకెళ్లాలనుకుంటే మీకింకో షాక్ అదే సుధీర్ బాబు.

ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచీ ప్రేక్షకుడు ఊహించని జోనర్ మూవీ ఇది. ఇంత వైలెంట్ థ్రిల్లర్ తీయడానికి ఎవరో గట్టిగానే మోటివేట్ చేసుండాలి. సగటు మనిషిలో ఒక వైలెంట్ కోణం దాగుని ఉంటుందని దర్శకుడు నానీ బస్లో ట్రావెల్ చేసే సన్నివేశంలో జస్టిఫై చేస్తాడు. ఇది ఇంద్రగంటి, నానీ, సుధీర్ బాబుకి కూడా ఒక కొత్త టాస్క్. ఎలా చేసారో చూద్దాం

నానీ తన గత చిత్రాల చాయలకు భిన్నంగా ఉండడంకోసం వాయిస్ మాడ్యులేషన్లో మీటర్ గానీ, .  మేకప్ స్టైలింగులో వేరియేషన్స్ గానీ ప్రతీ చోటా ఖచ్చితమైన కొలతలతో సెట్లోకెళ్లాడనిపిస్తుంది, స్క్రీన్ మీద నానీని చూసినప్పుడంతా. తన స్వతసిద్దమైన ఒవర్లాపింగ్ డిక్షన్ నుంచి బయటపడడానికి చాలానే కష్టపడ్డడనిపిస్తుంది (మంద్రంగా, కరకు గా ఉండే వాయిస్ ఈ పాత్ర కోసం అది చాలా అవసరం కూడా). ఈ సినిమా వరకూ కధానుగుణంగా తన పరిధి మేరకు ఫిజిక్ కూడా బాగా ఎక్టోమార్ఫిక్ గా ఉంచడానికి ఎంత కష్టపడ్డాడో కనిపిస్తుంది.

సుధీర్ బాబు గురించి ఈ సినిమాలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది సో కాల్డ్ హీరోల చీటీలు చిరిగిపోతాయ్ గనుక. తన ఎంట్రీ కి సూపర్ స్టార్ ఫ్యామిలీ టాగ్ ఎంతో కొంత ఉపయోగపడినా, సినిమాపై తనకుండే కమిటెడ్ ప్యాషన్ సుధీర్ ని ఈ క్యారెక్టర్ దాకా తీసుకొచ్చింది. దాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకున్నాడు కూడా . మస్క్యులర్ సూపర్ కాప్ లుక్స్ , రొమాంటిక్ సీన్స్ నుంచీ అగ్రసివ్ ఎమోషన్స్ దాకా ఒక సటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

ఇక కధేంటో క్లుప్తంగా చెప్తా..
ఒక సూపర్ కాప్ ఆదిత్యా (సుధీర్ బాబు) జీవితంలో ఒక సైకో కిల్లర్ (నానీ) విసిరిన ఛాలెంజ్. ఆ సైకో చేసే అతి జుగుప్త్సాకరమైన హత్యల వెనకాల అతని అందమైన కలల జీవితం. అతని ప్రియురాలి (అదితి) మరణం, అందుకు దారితీసిన భయంకరమైన సంఘటనలు, దానిని ఆదిత్య (సుధీర్ బాబు) ఎలా ఎదుర్కొన్నాడు. ఛాలెంజ్ లో గెలిచాడా. హత్యల వెనకాల అసలు కారణాలు తెల్సుకున్నాడా అనేది మెయిన్ ప్లాట్.

సుధీర్ బాబు ఎంట్రీ యాక్షన్ సీన్, సినిమాకి హైప్. కిల్లర్, హత్యలు చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే పజిల్డ్ హింట్స్ బావుంటాయి. వి టైటిల్ జస్టిఫికేషన్ ఇదే . క్రైమ్ రచయితగా మారిన సైకాలజీ స్టూడెంట్ ఇంట్రడక్షన్ ఇచ్చి నివేదా పాత్రతో ఎదో చేయిస్తారనుకునేలా షేడీ గా అనిపిస్తుంది. సుధీర్, నివేదాల కెమిస్ట్రీ కొత్త తరహాలో ఉంటుంది. అదితీ రావ్ హైదరీ సెకండాఫ్లో కీలక పాత్రలో మెరుస్తుంది.

వెన్నెల కిషోర్ పాత్ర పరిధి తక్కువ, హ్యూమర్ కి స్కోప్ కూడా తక్కువే. ఒక్కసారే కనపడే నరేష్(సీనియర్) పాత్ర ఎడిటింగ్ లో ఎమైనా తీసేసారేమో అనిపిస్తుంది.

టెక్నికల్ గా ఈ సినిమా వేరే స్థాయిలో ఉంటుందనొచ్చు, తప్పులేదు. పి.జి విందా సినిమాటోగ్రఫీకి ఫుల్ మార్క్స్ కొట్టేసినట్టే. థ్రిల్లర్ సినిమాల బి.జీ.ఎం కి కేరాఫ్ అడ్రస్ తమన్ మరోసారి తన జూలు విదిలించాడు. అమిత్ త్రివేదీ పాటల్లో రెండు హమ్మింగా ఉంటాయి. దర్శకుడు ఇంద్రగంటి కి ఇంట్రోలో పబ్ లో పాట సెంటిమెంటేమో దీంట్లో కూడా ఉంది.

నానీ-సుధీర్ బాబుల మధ్య జరిగే రోలర్ కోస్టర్ లాంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా వేగంగా నడుస్తుంది, ప్రి క్లైమాక్స్ అనుకున్న స్థాయి లేకపోవడం ప్రేక్షకుడిని కొంత నిరాశపెడుతుంది కానీ క్లైమాక్స్లో ఎమోషనల్ జస్టిఫికేషన్ ప్రేక్షకుడి గుండెల్ని తడిపేస్తుంది.
ఓ.టి.టి ల పెత్తనం మొదలయ్యాక మంచి అంచనాలతో వచ్చిన ఈ క్రేజీ మూవీని..
“చూస్తే పోయేదేముందీ ఎదో నానీ మీ పక్కింటబ్బాయే అనే అభిప్రాయం తప్ప”..!!

8 COMMENTS

  1. చాలా బాగా రాశారు. 1980 దశకంలో డిగ్రీ చదివే రోజుల్లో వాసిరాజు ప్రకాశం గారు సినిమా మీద రివ్యూ రాసేవారు..దానిలో విమర్శ ఉండేది, మెచ్చుకోలు కూడా ఉండేది..కళ్యాణ్ గారు రాసిన ఈ ఆర్టికల్ చదివాక 36 ఏళ్ల కిందటి ఆ మహానుభావుడు గుర్తుకొచ్చాడు..యసస్వీభవ..

    • అంతటి మహానుభావులతో పోలికకు నేను అర్హుడిని కాదులెండి.
      మీ అభిమానానికి ధన్యోస్మి

  2. ఎం సెప్తిరి ఎం సెప్తిరి..”V” పైన విశ్లేషణ అద్భుతం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here