పవన్ కళ్యాణ్ 26వ సినిమా.. వకీల్‌సాబ్. రాబోయే సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఆలస్యమైన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ మేరకు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్, శృతిహాసన్ కలసి నటిస్తున్న మూడో సినిమా.. మొదట గబ్బర్‌సింగ్‌లో శృతి హాసన్ నటించారు. అయితే ఆ సమయంలో నిర్మాత బండ్ల గణేశ్.. ప్లాప్ హీరోయిన్ శృతిహాసన్‌ను తీసుకోవటాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారట. దీనికి సమాధానంగా.. నువ్వు తీసిన సినిమాలన్నీ హిట్టయ్యాయా! అని అడగంతో బండ్ల సైలెంట్ అయ్యారంట. ఈ విషయాన్ని ఇటీవల అలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో స్వయంగా బండ్ల వివరించారు. ఆ తరువాత కాటమరాయుడులోనూ జంటగా మెరిచారు. మూడోసారి పవన్‌తో శృతిహాసన్ అభిమానులను అలరించనున్నారన్న మాట. వకీల్‌సాబ్ సినిమాపై ఫ్యాన్స్‌లో ఎన్నో అంచనాలున్నాయి. హిందీ సినిమా పింక్‌ను రీమేక్ చేస్తున్నా..తెలుగుదనానికి ఎక్కడా అవరోధం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మగువా మగువా అనే పాట ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది.