పవర్‌స్టార్ మెట్రో రైలెక్కితేనే.. ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. ఇక.. సినిమా రిలీజైతే.. అదో పండుగే. ఇప్పటికే కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు మూతబడ్డాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించి అవకాశం ఇచ్చినా ఉత్తరాధిన స్పందన లేదు. ఏపీ తెలంగాణల్లోనూ సినిమా థియేటర్ల యజమానులు భయపడుతున్నారు. దసరా, దీపావళి పండుగలకు కొత్త సినిమాలు రిలీజ్ అనుకున్నా.. కొవిడ్ భయంతో నిర్మాతలు వెనుకంజ వేశారు. మిగిలింది.. 2021 జనవరి.. అంటే.. సంక్రాంతి. కొత్త ఏడాది.. తెలుగు పండుకు ఎవరి సినిమా రాబోతుంది. ఏ హీరోతో మళ్లీ సినిమా థియేటర్లకు కొత్త కళ వస్తుందనే అనుమానం రాగానే.. వినిపించిన తొలిపేరు పవన్ కళ్యాణ్.. ఇప్పటికే వకీల్‌సాబ్ షూటింగ్ దాదాపు పూర్తిచేసుకుంది. డబ్బింగ్, సెన్సార్ పూర్తయేందుకు మరో నెల సమయం పడుతుందని సమాచారం ఈ లెక్కన.. రాబోయే పొంగల్‌కు వకీల్‌సాబ్ సందడి చేయబోతున్నట్టు సినీవర్గాల్లో సమాచారం. ఇదే నిజమైతే.. మెగా ఫ్యాన్స్‌కు.. జనసేన అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాటే.