వకీల్ సాబ్ రివ్యూ By Kalyan Kishore

అతననుకున్నది చేసితీరడం అతనికున్న వ్యసనం
అతని అభిమానులకి మాత్రం అతనే ఒక వ్యసనం
అదే అతని ఫ్యాన్స్ భాషలో చెప్పాలంటే “మూడు యుగాల్లాంటి మూడు సంవత్సరాల తర్వాత ఎత్తిన మరో అవతారం ఈ వకీల్ సాబ్

విశ్లేషణ:
హిందీ లో పింక్ కి రీమేక్ గా మొదలై మొదట్లో వేరే హీరోని అనుకుని అనూహ్యం గా పవన్ కల్యాణ్ చేతిలోకొచ్చిన ఈ సినిమా పట్టాలెక్కడానికి దిల్ రాజు చాల హోంవర్కే చేసాడంట. ఆమితాబ్ లాంటి సెవెంటీస్ వయసు క్యారెక్టరైజేషన్ని పవన్ కి తగినట్టు మార్చి కధ పరిధి దాటకుండా, ప్రేక్షకుడిని కన్విన్స్ చేయగలరా. అదీకాక కేవలం రెండే రెండు మీడియం బడ్జెట్ సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీరాం వేణు పవర్ స్టార్ని రెండున్నర గంటలు క్యారీ చేయగలడా, వీటన్నిటికీ మించి. ఆకాశాన్నంటే కలెక్షన్ల అంచనాలకి ఈ కధ సరిపోతుందా..!!
వీటన్నిటినీ కట్చేస్తే ..కరోనా భయం గుప్పిట్లోంచీ బయటకొచ్చిన మొదటి భారీ టాలీవుడ్ రెలీజ్.”వకీల్ సాబ్”

కధలోకెళితే..
ముగ్గురు వర్కింగ్ వుమన్ అనుకోని పరిణామాల మధ్య మరో ముగ్గురు యువకులతో ఒక రెసార్ట్లో ఇరుక్కుని, వేధింపబడి, తర్వాత వారితో జరిగిన ఘర్షణలో ఒకరిని తీవ్రంగా గాయపర్చి తప్పించుకుంటారు. తదనంతరం వాళ్ళ మీద హత్యానేరం మోపబడుతుంది. వాళ్లకి ఒక్ తాగుబోతు అయిన లాయర్ సత్య దేవ్ ఎలా పరిచయమయ్యాడు. అతని గతం ఏమిటి , వకీల్ సాబ్ వీళ్లకి ఎలా సహాయం చేసాడు. అనేదే క్లుప్తంగా కధ.
ముఖ్యం గా డైరెక్టర్ కధ ఒరిజినల్ ప్లాట్ ని ఏమాత్రం మార్చకుండా జాగ్రత్త పడ్డాడు. కేవలం సత్యదేవ్ కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హీరోయిన్ (శృతీహాసన్) తప్ప. ఇది కొంత ఎబ్బెట్టుగానే ఉంది. శృతీ కూడా లుక్స్ మీద అంత శ్రద్ధ పెట్టినట్టనిపించదు. ఇది గతంలో కూడా కాటమరాయుదుకి ఒక రకం గా మైనెస్సయ్యింది. కానీ పవన్ ఆరాలో అదంతా మనకి పెద్దగా కనిపించదు.

ఫస్టాఫ్ ప్లాట్ కనస్ట్రక్షన్, ఇంకా కొన్ని రొటీన్ సీన్స్ తో సాగినా, ఇంటెర్వెల్ మాత్రం ఫరవాలేదింక ఒక మంచి పాప్కార్న్ బకెట్ కొనేయొచ్చనే ఉత్సాహాన్నిస్తుంది.
సెకండాఫ్ గాడ్జిల్లా వెర్సర్ కాంగ్

ఇరవయ్యేళ్ల తర్వాత ప్రకాష్ రాజ్ లాయర్ నంద గా బద్రి నాటి యాటిట్యూడ్ క్యారెక్టరైజేషన్ని మళ్ళీ గుర్తుకుతెస్తుంది. ట్రైలర్లో కూర్చోండి నందజీ డైలాగ్ టైమింగ్ ఇప్పటికే జనాలకి బాగా ఎక్కేసిoదే.
కోర్ట్రూం డ్రామా, పవన్ యాటిత్యూద్, కొంచెం కొత్తగా ట్రై చేసిన డయాలెక్ట్, పంచ్ టైమింగ్ వేరే లెవెలంటే పెద్ద ఎగ్జాగరేషనేంకాదు. పవన్ కెరీర్ బెస్ట్ పెర్ఫోర్మన్సెస్ లో ఇది తప్పకుండా ఉంటుంది..ఏక్టర్గా పవన్ ని ఒక సటిల్ పెర్ఫార్మన్స్ రాబట్టడానికి శ్రీ రాం వేణూ కి ఫుల్ మార్క్స్ ఇచ్చేయొచ్చు. ఇక అవన్నీ పెద్ద స్క్రీన్ మీద మాస్కుపెట్టుకుని చూస్తేనే కిక్కు కూడా.

కధకి మూలమైన మూడు పాత్రలు నివేథా థామస్, అంజలీ, అనన్యా, వందశాతం వీళ్ళే ఆ క్యారెక్టర్లకి యాప్టేమో అనిపిస్తుంది.

సినిమాకి కంటెంటున్న కధ, కటౌట్తో పాటూ కంటెంటున్న నటులు, తర్వాత పాటలు అంత ముఖ్యం. ఈ సినిమాకి పాటలు సందర్భానుసారంగా మాత్రమె వాడారు ఆ విషయంలో దర్శకుడు స్ట్రిక్ట్గా ఉన్నాడనే చెప్పాలి. అబొవ్ ఆల్ సినిమా సీన్ ఎలెవేషన్ కి ముఖ్యమైన ప్లస్ అండౌటెడ్లీ థమన్ ఇచ్చిన బీజీఎం.

సగటు సినిమా ప్రేక్షకుడిని, ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్స్ కి ఆడపిల్లలు లేచి చప్పట్లు కొట్టడం కూడా చూసాను. ఒరిజినల్ కే చాలెంజ్ విసిరే రీమేక్ ఇది.. Go and Watch on Bigscreen

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here