Home సినీలోకం అంగరంగ వైభవ పూజా కార్యక్రమాలతో “వేటగాడు(వీడు క్రాక్ గాడు)” చిత్ర ప్రారంభం 

అంగరంగ వైభవ పూజా కార్యక్రమాలతో “వేటగాడు(వీడు క్రాక్ గాడు)” చిత్ర ప్రారంభం 

అభిషేక్ ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై చరణ్ బాలాజీ దర్శకత్వంలో పరకోటి బాలాజీ నిర్మాతగా “వేటగాడు (వీడు క్రాక్ గాడు) చిత్రం 27 ఫిబ్రవరి 2026, శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా దాసరి పద్మ రేఖ గారు విచ్చేసి క్లాప్ కొట్టారు. నిర్మాత జెవి మోహన్ గౌడ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత చందన రాజు, ముఖ్య అతిథులుగా నటుడు కృష్ణ తేజ విచ్చేసి యూనిట్ సభ్యులకి శుభాకాంక్షలు అందచేశారు.

 

బాలాజీ, అంకి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో థ్రిల్లర్ మంజు, సుమన్, నాగ మహేష్, బాలచంద్ర, హర్ష వర్దిని, కోటేశ్వర రావు, దేవి కుమారి, గీత రెడ్డి, పద్మ, ఫణి, శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తంగిరాల ఆనంద కృష్ణ రచించిన ఈ చిత్రానికి నగేష్ వర్మ డిఓపి గా పని చేయగా కిరణ్ తేజ్ సంగీతం అందిస్తున్నారు. బుస్సా బాలరాజు ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు.

 

 

సాంకేతిక బృందం :

దర్శకుడు : చరణ్ బాలాజీ

రచన : తంగిరాల ఆనంద కృష్ణ

నిర్మాత : పరకోటి బాలాజీ

సహా నిర్మాత : డా. Sk జలీల్

డిఓపి : నాగేష్ వర్మ

ఆర్ట్ : వెంకట్

మేకప్ : కుమార్

కాస్ట్యూమ్స్: నాగరాజు

సంగీతం : కిరణ్ తేజ్

స్టిల్స్ : అర్జున్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బుస్సా బాలరాజు

డైరెక్షన్ డిపార్ట్మెంట్ : వెంకీ, చిరంజీవి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here