సినీ ఇండస్ట్రీలో ఎదగటం అంత సులువు కాదు. ఒకవేళ సక్సెస్ సాధించినా దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికా కాదు. తమిళనాడు ప్రేక్షకులకు సినిమా క్రేజ్ వేరు. దైవంగా పూజిస్తారు. కాదంటే.. బజారుకు ఈడ్చుతారు. మొన్నటికి మొన్న.. గుడికట్టిన తార ఖుష్బూ కూడా ఒక్కమాట నోరుజారితే నానాయాగీ చేశారు. చివరకు క్షమాపణ చెప్పి బతుకుజీవుడా అనుకుని బయటపడాల్సి వచ్చింది. ఇప్పుడు అదేదారిలో విజయ్‌సేతుపతి.. ది గ్రేట్ క్రికెటర్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 800 బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యారు. దాంట్లో విజయసేతుపతి ప్రధానపాత్ర పోషించనున్నారు. ఇద్దరూ దిగ్గజాలే. ఎవరి రంగాల్లో వారికి తమదైన గుర్తింపు ఉంది. అందుకే. సినిమాపై టాక్ పీక్‌కు చేరింది. కానీ ఇంతలోనే తమిళ ప్రేక్షకుల నుంచి విమర్శలు షురూ. అప్పట్లో ప్రత్యేక శేలం కోసం పోరు చేసిన ఎల్ టీటీఈ లో ప్రభాకరన్ కీలక పాత్ర. శ్రీలంక కేంద్రంగా సాగిన పోరులో ఎంతోమంది మరణించారు. అటువంటి పోరులో తమిళులకు అనుకూలంగా ముత్తయ్య మురళీధరన్ స్పందించలేదనేది ఇప్పుడు తమిళ వ్యతిరేకత కారణం..
భాష, సంప్రదాయం, ఏదైనా తమిళనాట ఎమోషన్ అంశమే. దీంతో విజయసేతుపతి 800 నటించకూడదంటూ నిరసనలు మొదలయ్యాయి. దీనిపై ముత్తయ్య కూడా స్పందించి. వద్దులే విజయ్ సినిమా చేయవద్దంటూ సూచించారు. హీరో కూడా సినిమా నుంచి తప్పుకున్నారు. కానీ.. తాజాగా విజయ్‌సేతుపతి కూతురుపై లైంగికదాడి చేస్తామంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలతో మరోసారి అంశం తెరమీదకు వచ్చింది. దీనిపై ఖుష్బూ స్పందించారు. విజయ్‌సేతుపతికి సంఘీభావం తెలిపారు. ఇటువంటి బెదిరింపులను తట్టుకోవాలని.. పాల్పడే వారిపట్ల చట్టం తనపని తాను చేసుకు వెళ్తుదంటూ ధైర్యం చెప్పారు. ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఉంటాయంటూ ఖుష్బూ చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసిన ఖుష్బూ కమలం గూటికి చేరారు. తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు.