మెగాబ్రదర్స్ మాంచి ఫామ్‌లో ఉన్నారు.. అన్నయ్య ఆచార్య.. తమ్ముడు వకీల్‌సాబ్.. నాగబాబు. విలన్‌గా వెండితెరపై కొత్త రూపంతో ఫ్యాన్స్‌ను అలరించబోతున్నారట. నాగబాబు. చిరంజీవి నటించిన త్రినేత్రుడు, మరణమృదంగం, కొండవీటిదొంగ, హ్యాండ్సప్ . మృగరాజు వంటి సినిమాలు అభిమానులకు డబుల్ ధమాకా పంచాయి. బావగారూ బాగున్నారా సినిమాలో ఒక పాటలో నాగబాబు కనిపిస్తారు. ఆ తరువాత సోలోగా కొన్ని సినిమాలు చేసినా అంతగా పేరు తీసుకురాలేదు. చందమామతో కృష్ణవంశీ మరోసారి నాగబాబు సత్తాను వెండితెరపై చూపారు. ఇప్పుడు తనయుడు వరుణ్‌తేజ్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఇటువంటి సమయంలో నాగబాబు విలన్ గా తెలుగు చత్రపతి హిందీ రీమేక్‌లో నటించబోతున్నారని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా హిట్టయితే… జగపతిబాబు తరువాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాగబాబు సెకండ్ ఇన్నింగ్స్ దుమ్ము దులుపుతారన్నమాటే.