హిందూ దేవాలయాల భూములు జోలికి వస్తే చూస్తూ ఊరుకోం – బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.

రాజమహేంద్రవరంలో మీడియాతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలపై దాడులు చేయడం గృహ నిర్భందాలు చేయడం దారుణం అని ప్రభుత్వం తీరు పై సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వం హిందూ దేవాలయాలు జోలికి కాని దేవాలయాల భూములు జోలికి కానీ వస్తే చూస్తూ ఊరుకోమని సోము వీర్రాజు హెచ్చరించారు . అంతర్వేది రథం దగ్ధమైన ఘటనలో కొంతమంది మత ప్రచారం గా మాట్లాడటం మంచిది కాదు అని గతంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్న ఇసుకపై ధర్నా నిర్వహించాము అని పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు అవినీతి అక్రమాలు జరిగాయని ధర్నాలు చేసామని అన్నారు.

బిజెపి జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంతర్వేది విషయంలో నిరసనలు వ్యక్తం చేశామని అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఎవరు కు మద్దతు ఇస్తుందో ప్రజలు చూస్తున్నారని అలాగే చర్చి మీద రాళ్లు వేస్తే 30 మంది పై కేసులు అరెస్టులు చేశారని హిందూ దేవాలయాల పై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా ప్రభుత్వం చేతులు దులుపుకుంది అని ఇదంతా బిజెపి ప్రభుత్వం గమనిస్తుంది అని సోము వీర్రాజు అన్నారు. ఇంకా కొన్ని చోట్ల దాడులు చేసి గృహ నిర్భందాలు అరెస్టులు చేసిన సంఘటన ఉన్నాయని దీనిమీద బిజెపి ప్రభుత్వం ఆలోచిస్తుందని రాబోయే రోజుల్లో బిజెపి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలతో ముందుకు వెళతామని సోము వీర్రాజు తెలిపారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు కందుల దుర్గేష్ బిజెపి పార్లమెంట్ నాయకులు పరిమి రాధా బిజెపి రాష్ట్ర మహిళా నాయకురాలు రేలింగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Previous articleశ్రియ‌‌కు అప్పుడే 35 ఏళ్ల‌ట‌
Next articleశ్రీధ‌ర్ @శ్రీమంతుడు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here