కరోనా తగ్గుముఖం పడుతుందనే సమయంలో ఊహించని షాక్. కరోనా స్ట్రయిన్ కొత్త వైరస్ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. యూరప్‌లో ఇప్పటికే వందలాది కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లండన్ ఇప్పుడు ఒంటరిగా మారింది. ఆ దేశంతో ప్రయాణ, వాణిజ్య కార్యకలాపాలు దాదాపు అన్ని ప్రపంచదేశాలు నిలిపివేశాయి. సరిహద్దు దేశాలు తమ భద్రత దృష్ట్యా బంద్ చేశాయి. లండన్ తో పొంచి ఉన్న ముప్పుతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల మొదటి తారీఖు నుంచి లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం ద్వారా 2300 మంది తెలంగాణ, ఏపీల్లోకి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ సమయంలోనే లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ వైరస్ సోకినట్టు తాజాగా చెన్నైలో గుర్తించారు. పొరుగున ఉన్న సరిహద్దు రాష్ట్రంలో తొలికేసు నమోదు కావటంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. తెలంగాణలోకి వచ్చిన 2300 మంది ఎక్కడ ఉన్నారనేది వెతికే పనిలో నిమగ్నమయ్యారు. వీరిలో ఎంతమంది పాజిటివ్.. ఇంకెందరు నెగిటివ్ అనేది ఆందోళన కలిగిస్తోంది. నెగిటివ్ వచ్చిన వారిని కూడా 8 రోజులు క్వారంటైన్‌కు తరలించనున్నారు.