ఇప్పటి వరకూ అమెరికా ఎన్నికల ఓట్ల ఫలితాల్లో బైడెన్ 264, ట్రంప్ 214 సీట్లు సాధించారు. శుక్రవారం మధ్యాహ్నం నాటి పరిస్థితులు ఇలా ఉన్నాయి. 270 సీట్లు సాధిస్తే.. బైడెన్ గెలిచినట్టే. ఎస్.. డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఓటమి అంచుల్లో ఉన్నారు. ప్రత్యర్థి బైడెన్ గెలుపునకు చేరువయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆఖరి అంకానికి చేరాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రానికి పూర్తి కానుంది. అయితే పలు రాష్ట్రాల్లో తనకు వ్యతిరేకంగా గవర్నర్‌లు ప్రవర్తించారంటూ ట్రంప్ సుప్రీంను ఆశ్రయించటంతో ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది.
ఇప్పటికే యూఎస్‌లో పలు చోట్ల గొడవలు మొదలయ్యాయి. ఎవరు గెలిచినా.. ఓడినా అగ్రరాజ్యంలో మంటలు చెలరేగటం ఖాయమని అక్కడి భద్రతా రంగ నిపుణులు అనుమానం వెలిబుచ్చారు. మూడు రోజులుగా దుకాణాలు, మాల్స్, సినిమా థియేటర్లు అన్నీ మూసివేయటమే ఇందుకు నిదర్శనం. 264 వరకూ సీట్లు సాధించిన బైడెన్ దాదాపు అధ్యక్ష పీఠానికి దగ్గరయ్యారు. ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప ట్రంప్ రెండోసారి వైట్‌హౌస్‌కు వెళ్లలేరనే నిర్ణయానికి దాదాపు అమెరికా ప్రజలు నిర్ణయానికి వచ్చారట. బైడెన్‌కు పెరిగిన ఆధరణకు ట్రంప్ నోరే కారణంగా మారింది.ప్రవాస భారతీయులు కూడా ట్రంప్ వీసాల చుట్టూ ఆడిన డ్రామా.. పెట్టిన ఇబ్బందులతో దూరమయ్యారు. బైడెన్ కూడా భారత్‌కు స్నేహహస్తం చాటుతామని.. తమకు ఇండియా చాలా ప్రధానమైన మిత్రదేశమంటూ చేరువయ్యారు. వీసాల విషయంలో ఆంక్షలను సడలించటం.. భారతీయులను ఆత్మీయులుగా చెప్పటం బాగాకలసి వచ్చింది. అమెరికా ఆశపెట్టుకున్న తెలుగోడి కలలు దాదాపు నెరవేరబోతున్నట్టే చెప్పాలి. బైడెన్ గెలుపు విషయం ప్రకటించటమే లాంఛనం కావటంతో అమెరికా సీక్రేట్ సర్వీసు సంస్థ బైడెన్‌కు భద్రతను పెంచింది. ఈ ఒక్కటి చాలు.. బైడెన్ దాదాపు వైట్‌హౌస్‌కు దగ్గరయ్యారనేందుకంటూ అగ్రరాజ్య ప్రజలు దృఢమైన నిర్ణయానికి వచ్చారట.



