ప్రతి మూడు సెకండ్లకు ఒకరు ఏదో ఒక రకమైన డెమెన్షియా బారిన పడుతున్న వారే. ప్రస్థుతం ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ప్రజలు ఈ వ్యాధితో బ్రతుకుతున్న వారేనని, రానున్న ప్రతి ఇరవై సంవత్సరములకు ఈ సంఖ్య రెట్టింపు అవుతూ 2050 నాటికి 152 మిలియన్ లకు చేరుతుందనేది అంచనా. ఇక భారత దేశ విషయానికొస్తే నానాటికీ పెరుగుతున్న వృద్దుల సంఖ్య కారణంగా మిగతా ప్రపంచం కన్నా ఇక్కడ ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముంది. అయితే ఇప్పటికీ ముగ్లురిలో ఒకరికి ఈ వ్యాధి పట్ల కనీస అవగాహన లేదని గణాంకాలు తేల్చి చెపుతున్నారు.
అసలు ఈ రుగ్మత రావడానికి ప్రధాన కారణం అల్జీమర్స్ అనే వ్యాధి. అల్జీమర్స్ వ్యాధి కారణంగా మన మెదడులో ఉన్న కణాలు జీవాన్ని కోల్పోయి నెమ్మదిగా చనిపోవడమనే ప్రక్రియకు లోనవుతాయి. దీని కారణంగా మనం ఆలోచించే తీరు, వ్యవహరించే పద్దతులు, సమాజంలో సంచరించే శైలి, నైపుణ్యత వంటివి సన్నగిల్లి నెమ్మదిగా తన పని తాను స్వతంత్ర్యంగా చేసుకొనే స్థితి నుండి పూర్తిగా ఇతరులపై ఆధారపడే పరిస్థితి వస్తుంది.
అందుకే డెమన్షియా లేదా అందుకు కారణమయ్యే అల్జీమర్స్ ను 21 వ శతాబ్దం లో ప్రమాద కరమైన ఆరోగ్య సమస్యగా గుర్తించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై అవగాహన కలిగించడానికి ప్రత్యేక కృషి చేస్తోంది.
ప్రపంచ అల్జీమర్స్ మాసం
ప్రతి ఏటా 21 సెప్టెంబర్ ను ప్రపంచ అల్జీమర్స్ దినం గా పాటిస్తున్నారు. ఇది ఏటా సెప్టెంబర్ మానమంతా నిర్వహించబడే అల్జీమర్స్ మాసం లో భాగంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాలలో భాగంగా ఈ వ్యాధిపై అవగాహన కలిగించే దీని పై ఉన్న భయాందోళనలు, అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఈ వ్యాధి గ్రస్థులకు అవసరమైన చికిత్స, సహాయం అందించడానికి కృషి చేస్తున్నారు.
డెమన్షియా గురించి మాట్లాడదాం….
ఏటా నిర్వహించే అల్జీమర్స్ మాసం ద్వారా నిర్వహించే క్యాంపైన్ లో ప్రధానంగా ఈ సంవత్సరం డెమన్షియా గురించి మనసు విప్పి మాట్లాడుదాం అన్న థీమ్ తో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రధానంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీరి కష్టాలను తగ్గించి వారికి సరైన సేవలు అందించడం చేయాలనే లక్ష్యం ఇందులో ఇమిడి ఉంది.
అసలు డెమన్షియా అంటే ఏమిటి –
డెమన్షియా అనేది మెదడు లో క్రమంగా తలెత్తే పలు రుగ్మతల కారణంగా ఏర్పడే మతి మరుపు, ఆలోచన తగ్గిపోవడం, ప్రవర్తన మారిపోవడం, తీవ్రమైన భావోద్వేగాలు వంటివి కలుగచేసే లక్షణాలకు సామూహికంగా గుర్తించడానికి పెట్టబడిన పేరు. అల్జీమర్స్ మరియు వాస్యులర్ డెమన్షియా అనేవి డెమన్షియా లో కనిపించే సాధారణమైన రకాలు. ఇవై 90 శాతం డెమన్షియా కేసులకు కారణమవుతున్నాయి.
పది రకములైన డెమన్షియా హెచ్చరికలు
- మతి మరపు
- భాషను పలకడంలో సమస్యలు
- టైమ్ మరియు స్థలలానికి సంబంధించిన సరిగ్గా గుర్తించలేకపోవడం
- సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవడం
- వ్యవహారాలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోవడం
- వస్తువులను ఉంచిన చోట మర్చిపోవడం లేదా పోగోట్టుకోవడం
- భావోద్వేగాలు మరియు ప్రవర్తన లో మార్పులు
- బొమ్మలు మరియు ప్రత్యేక సంబంధాలను గుర్తించ లేకపోవడం
- పని లేదా సామాజిక కార్యాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం లేదా పాల్గొనలేకపోవడం
ఇతర లక్షణాలు…
- సరైన పదాలు ఉపయోగించడంలో కొంత ఇబ్బంది పడడం లేదా ఇతరులు చెబుతున్నది సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం
- గతంలో సాధారణంగా చేసే పనులను ప్రస్థుతం చేయడంలో ఇబ్బంది పడడం
- వ్యక్తిగత భావోద్వేగాలలో మార్పులు
చికిత్స
డెమెన్షియా కు ఎటుంవటి మందులు, చికిత్స లేదు. వైద్యులు వీటి కారణంగా తలెత్తే పలు లక్షణాలకు మాత్రమే చికిత్స అందిస్తారు. అంటే డెమెన్షియా కారణంగా వచ్చే ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి లేదా చికాకు పడడం వంటి వాటికి అవసరమైన చికిత్స అందిస్తూ డెమెన్షియా ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు తప్ప నేరుగా వ్యాధికి చికిత్స లేదు.
డెమెన్షియా తో భాదపడే వారికెటువంటి సేవలు అందించాలి….
- నానాటికీ పెరుగుతున్న ఆందోళన, అస్పష్టత, గందరగోళం ఈ వ్యాధి యొక్క మొదటి లక్షణం. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే వైద్యున్న సంప్రదించి సూచనలు తీసుకోవాలి. వీరికి ముఖ్యంగా ఈ మహమ్మారి సమయంలో తీవ్రమైన గాలి పీల్చుకొనే ఇబ్బంది లేదా తీవ్రమైన జ్వరం ఉంటే తప్ప ఇతరత్రా సమస్యలకు వైద్యుని సంప్రదించి మందులు తీసుకోవచ్చు.
- ఇక డెమెన్షియా తో భాదపడుతున్న వారికి విషయాలు గుర్తు చేయడానికి వీలుగా విషయాలను నోట్ పై రాసి పెట్టడం లేదా ఇతర సాధనాల ద్వారా గుర్తు చేయడం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ కోవిడ్ మహమ్మారి సందర్భంగా వారు తీసుకోవాల్సిన జాగ్రతలు వంటివి. ఊదాహరణకు వారు చేతులు కడుగుతున్న సందర్భంలో వారు ఉపయోగించే వాష్ బేసిన్ అద్దంపై 20 సెకండ్లు చేతులు కడుగుకోవాలన్న అంశాన్ని రాసి నోట్ పెట్టవచ్చు. అలానే ఎలా చేతులు కడుక్కోవాలి, ఎటువంటి సానిటైజర్ ఉపయోగించాలి అన్న అంశాలను వారు తరచుగా గుర్తు పెట్టుకొనేటట్టుల నోట్ లు అందించాలి.
- ఇక వీరు ఫార్మసీ కి మందులు వెళుతున్న సందర్భాలలో పూర్తి కాలానికి మందులు తీసుకోనెలా చూడాలి. దాంతో వీరు మందులు మరచిపోయే అవకాశాలు తగ్గించవచ్చు.
- ముఖ్యంగా ఈ మహమ్మారి సందర్భంగా వారి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. తద్వారా వారు చేస్తున్న పనులను మరచిపోకుండా చూడాలి.
- ఇక వీరుండే కుటుంభ సభ్యులు ఒక వేళ ఇబ్బంది పడితే ఏం చేయాలనేది ప్రత్యేక ప్రణాళిక ద్వారా నిర్ణయించగలిగితే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
కోవిడ్ కారణంగా ఏర్పడే ప్రమాదాలు
- అల్జీమర్స్ కోవిడ్ రావడానికి కారణం కాదు అయితే వీరి కున్న ఈ మతిమరుపు కారణంగా వారికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరిని నిత్యం కనిపెట్టుకొని చేతులు కడుగుకోవడం వంటి విషయాలు తరచుగా గుర్తు చేస్తూ చేయించాల్సి ఉంటుంది.
- ఇక ఒక వేళ వారు కోవిడ్ మహమ్మారి బారిన పడితే వారిని ఇసోలేషన్ లో ఉంచే సందర్భాలలో తగిన జాగ్రత్తలు తీసుకొని మతిమరుపు కారణంగా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలి. దీంతో పాటూ వీరి కున్న ఈ రుగ్మత కారణంగా వీరి పరిస్థితి దిగజారకుండా చూసుకోవాలి.
డెమెన్షియా రాకుండా ఐదు నివారణ చర్యలు
గుండెను జాగ్రత్తగా చూసుకోవడం – ధూమపాన, ఎక్కువ రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, షుగర్, ఊబకాయం వంటివి రక్తప్రసరణ వ్యవస్థ ను దెబ్బ తీసి స్ట్రోక్ లేదా పోటు రావడానికి కారణమవుతాయి. అంతే గాకుండా ఇవి డెమెన్షియా కు కూడా దారి తీస్తాయి. మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి కారణంగా దీనిని నివారించవచ్చు.
నియమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంచుకోవడంతో పాటూ స్నేహితులు, కుటుంభ సభ్యులతో గడుపడం ద్వారా దీనికి దూరంగా ఉండవచ్చు. మంచి ఆరోగ్యకరమైన, సమతుల్యైమైన, సంపూర్ణమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నియంత్రించుకోవచ్చు. సామాజిక, కుటుంభ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం ద్వారా మెదడు చురుకుగా ఉండడమే కాకుండా దాని యొక్క నిద్రాణంలో ఉండే భాగాలు కూడా ప్రభావితం అవుతాయి. దీంతో ఒత్తిడే కాకుండా డెమెన్షియా లాంటి వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఎక్కువ మంది స్నేహితులు మరియు బంధువులతో కాలం గడపాలి. వీరితో పాటూ మీ శారీరక వ్యాయామం చేయడం లేదా ఇతర క్రీఢలలో పాల్గొనడం ద్వారా ఈ వ్యాధికి లోనైనా చురుకుగా ఉంటారు.
ఎప్పటికపుడు మెదడుకు సవాల్ విసిరేలా కార్యకలాపాలను నిర్వహిస్తూ తద్వారా మెదడు లో సరికొత్త న్యూరాన్లను పెంపొందించుకొనే లా చేసి వాటి మధ్య ఉన్న బంధాలను పటిష్టపరిచేందుకు కృషి చేయాలి. దీని కారణంగా అల్జీమర్స్ లేదా డెమన్షియా ఫాథాలజీల యొక్క దుష్రభావాన్ని తగ్గించవచ్చు. ఇలా మెదడును ఛాలెండ్ చేసే సరికొత్త విషయాలను నేర్చుకొంటూ ముందుకు సాగాలి. అంటే కొత్త భాష నేర్చుకోవడం లేదా కొత్త ప్రక్రియ చేయడం లాంటి ముఖ్యంగా ఈ కోవడి మహమ్మారి సమయంలో చేయాలి.
ముఖ్యంగా ఈ మహమ్మారి సయమంలో అధిక ప్రమాదకారి వ్యక్తులుగా వృద్దులను పేర్కొంటున్నాం. ఇలాంటి వ్యాధులున్న వారు మరీంత హై రిస్క్ కేటగరిలో చేరుతారు కాబట్టి వారికి తగిన రీతిలో సహాయం, జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జాగ్రత్తే వారి జీవితాలను మహమ్మారి నుండి కాపాడే సమయంలో శ్రీరామ రక్ష.
Dr. Sindhu Vasireddy, Neurologist,
Aster Prime Hospital, Ameerpet, Hyderabad.